గవర్నర్ స్పీచ్: ప్రతులు చించిన తెరాస, టిడిపి బాయ్‌కాట్

సంక్షేమ పథకాలను అందరికీ అందించాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు. రూపాయికి కిలో బియ్యం ద్వారా చాలా మంది ప్రజలు ప్రయోజనం పొందుతున్నారని ఆయన అన్నారు. ఎస్సీఎస్టీ ఉప ప్రణాళిక చట్టం రూపకల్పన చారిత్రాత్మక నిర్ణయమని ఆయన అన్నారు. నీలం తుఫాను వల్ల ప్రజలు ఇబ్బందులకు గరుయ్యారని, తీవ్రమైన పంట నష్టం జరిగింది. ద్రవ్య విధానంలో ప్రభుత్వం తీసుకు వచ్చిన సంస్కరణలు సత్ఫలితాలు ఇస్తున్నాయని ఆయన అన్నారు. రాష్ట్రానికి ప్రపంచ పటంలో స్థానం కల్పించడంలో తాము విజయం సాధించామని ఆయన అన్నారు.గవర్నర్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు
గవర్నర్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు
- మెట్రో రైలు నిర్మానం వేగంగా జరుగుతోంది. 2014 డిసెంబర్ కన్నా ముందే వినియోగంలోకి వస్తుంది
- జనాభా వృద్ధి రేటు 1.11 శాతం ఉంది
- నిర్మల్ భారత్ అభ్యాన్ కింద పాఠశాలల్లో మరుగుదొడ్లు నిర్మిస్తాం
- జెఎన్ఎన్ఆర్‌యుఎం కింద నగర సుందరీకరణకు చర్యలు తీసుకుంటాం
- నాగోల్ - మెట్టుగుడా కారిడార్ గడువు కన్నా ముందే పూర్తి అవుతుంది.
- 12వ పంచ వర్ష ప్రణాళికలో పేదరికాన్ని నిర్మూలించడమే మా ధ్యేయం
- నీలం తుఫాన నష్టం రూ. 3,560 కోట్లు. నష్ట తీవ్రతను పరిగణనలోకి తీసుకుని నష్టపరిహారాన్ని హెక్టారుకు రూ. 6 వేల నుంచి 10 వేలకు పెంచాం
- ఆధార్ కార్డుల పంపిణీలో దేశంలోనే రాష్ట్రం అగ్ర స్థానంలో ఉంది.
- ఉగ్రవాదంపై అలసత్వం ప్రదర్శించబోం
- రూపాయికి కిలో బియ్యం పథకం ద్వారా చాలా మంది లబ్ధి పొందుతున్నారు.
- జలయజ్ఞం కింద మరో 50 ప్రాజెక్టులు పూర్తి చేస్తాం
- రాజీవ్ యువకిరణాలు పథకం ద్వారా 15 లక్షల మంది యువతకు ఉద్యోగాల కల్పన
- పేద విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాల పంపిణీ
- వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ ద్వారా ప్రాధాన్యం
- కొరత ఉన్నా రైతులకు ఉచిత విద్యుత్తు సరఫరాకు కట్టుబడి ఉన్నాం
- ఎస్సీ, ఎస్టీ, బిసీల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం
- సుపరిపాలన అందిస్తాం
- పాల ఉత్పత్తిలో రాష్ట్రం దేశంలోనే రెండో స్థానంలో ఉంది
- జలయజ్ఞం ద్వారా 80 లక్షల ఎకరాలకు సాగు నీరు
- సంప్రదాయేతర ఇందన వనరులకు కల్పనకు ప్రోత్సాహం
- మంచినీటి కల్పనకు, శుభ్రతకు ప్రభుత్వం కట్టబుడి ఉంది
- హైదరాబాదుకు గోదావరి జలాల తరలింపునకు వెంటనే చర్యలు
- పంటల భీమాను సమర్థంగా అమలు చేస్తున్నాం
- ప్రపంచ తెలుగు మహాసభల ద్వారా తెలుగు భాషాభివృద్ధికి కట్టుబడి ఉన్నాం












Click it and Unblock the Notifications