గడువు లేదు: తెలంగాణపై పాత పాటే కొత్తగా...

తెలంగాణ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు బడ్జెట్ సమావేశాల తర్వాత తేలుస్తుందని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణపై ఏకాభిప్రాయం సాధ్యం కాదని, ప్రజాస్వామ్యంలో మెజారిటీయే నిలుస్తుందని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు గుత్తా సుఖేందర్ రెడ్డి, మందా జగన్నాథం, పొన్నం ప్రభాకర్, వివేక్ అన్నారు.
అఖిల పక్ష సమావేశంలో మెజారిటీ పార్టీలు తెలంగాణకు అనుకూలంగా అభిప్రాయం చెప్పాయని వారన్నారు. విద్యుత్తు సరఫరాలో తెలంగాణ ప్రాంతం పట్ల ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వివక్ష ప్రదర్శిస్తున్నారని వారు విమర్శించారు. సొంత జిల్లా చిత్తూరుపై కిరణ్ కుమార్ రెడ్డి అమితమైన ప్రేమను కురిపిస్తున్నారని, తెలంగాణ ప్రాంతాన్ని మాత్రం పట్టించుకోవడం లేదని వారన్నారు.
తెలంగాణ ప్రాంతంలో పంటలను రక్షించేందుకు సరిపడా విద్యుత్తును అందించాలని వారు డిమాండ్ చేశారు. వస్త్రాలపై వ్యాట్‌ను ఉపసంహరించుకోవాలని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications