అక్రమాస్తులని హైకోర్టులో పిటిషన్: చిక్కుల్లో జానా

జెకెఎఆర్ ఎనర్జీ వెంచర్స్ పేరుతో పది రూపాయల విలువ చేసే షేర్లను 500 రూపాయలకు విక్రయించారని, ఆ రకంగా నల్ల డబ్బును తెల్ల డబ్బుగా మార్చారని ఆయన జానారెడ్డిపై ఆరోపణలు చేశారు. జానారెడ్డి ఆస్తులపై సిబిఐతో, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడి)తో విచారణ జరిపించాలని ఆయన హైకోర్టును కోరారు. జానారెడ్డితో సహా ఆయన 9 మందిని ప్రతివాదులుగా చేర్చారు.
హోం శాఖ మంత్రిగా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు జానారెడ్డి కోట్లాది రూపాయలు అక్రమంగా కూడబెట్టారని ఆయన ఆరోపించారు. కేశవరెడ్డి, అర్జున్ రెడ్డిలతో పాటు జానారెడ్డి కుమారుడు రఘువీర్, మరో కుమారుడిని ఆయన ప్రతివాదులుగా చేర్చారు. జానారెడ్డి విదేశాలకు డబ్బులు మళ్లించారని, హవాలా రూపంలో మళ్లీ కంపెనీల్లోకి తెచ్చుకున్నారని వివి రావు తన పిటిషన్‌లో ఆరోపించారు. బినామీ పేర్లతో జానారెడ్డి అక్రమంగా డబ్బులు సంపాదించారని ఆయన అన్నారు. జానారెడ్డి వ్యవహారంలో మనీ లాండరింగ్ జరిగిందని ఆయన ఆరోపించారు.
వివిరావు దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరిస్తుందా, లేదా అనేది ఇంకా తేలలేదు. ఆ విషయాన్ని హైకోర్టు తేల్చాల్సి ఉంది.












Click it and Unblock the Notifications