అడ్డుకుంటాం: ఈటెల, నా చేతుల్లో లేదు: కిరణ్ రెడ్డి

తెలంగాణ అంశం తమ చేతుల్లో లేదని, కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉందని, అందువల్ల తీర్మానం పెట్టలేమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కేంద్రం నిర్ణయం తీసుకుంటే తీర్మానం పెడతామని ఆయన అన్నారు. కేంద్రం తీసుకుని నిర్ణయానికి తాము కట్టుబడి ఉంటామని ఆయన చెప్పారు. శానససభలో చర్చించేందుకు తెలుగుదేశం 18 అంశాలను సమావేశంలో పెట్టింది.
కాగా, ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించేందుకు ఇతర పార్టీల సంతకాల సేకరణలో తెరాస పడింది. సిపిఐ సభ్యులు నలుగురు, బిజెపి సభ్యులు ముగ్గురు తెరాస ఇవ్వబోయే నోటీసుపై సంతకాలు చేశారు. సంతకం చేయడానికి సిపిఎం సభ్యుడు జూలకంటి రంగారెడ్డి నిరాకరించారు. అవిశ్వాస తీర్మానానికి తాము మద్దతు ఇస్తాం గానీ నోటీసుపై సంతకం చేయబోమని ఆయన చెప్పారు.
పార్టీని ధిక్కరిస్తే ఉపేక్షించేది లేదని ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణ తిరుగుబాటు శానససభ్యులను హెచ్చరించారు. బుధవారం ఉదయం మీడియాతో మాట్లాడారు. పార్టీలో క్రమశిక్షణను ఉల్లంఘించిన వారిపై అనర్హత వేటు తప్పదని తెలిపారు. చర్యలు తీసుకునే లోపే కొందరు ఎమ్మెల్యేలు మనసు మార్చుకుంటారని భావిస్తున్నట్లు గండ్ర చెప్పారు.
శాసనసభ సమావేశాలు సజావుగా సాగడానికి తెరాస సహకరించాలని ఆయన కోరారు. తెలంగాణ సమస్య పరిష్కారానికి తమ కాంగ్రెసు పార్టీ అధిష్టానం కృషి చేస్తోందని ఆయన అన్నారు. గవర్నర్ ప్రసంగంపై ప్రతిపక్షాలు వ్యవహరించిన తీరు విచారకరమని ఆయన అన్నారు. కాంగ్రెసును వీడినవారు మనసు మార్చుకుంటారని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications