బాలికపై అత్యాచారం, ఆపై హత్య: నదిలో శవం

పోలీసుల కథనం ప్రకారం మండలంలోని శివాలపల్లె ఆర్‌ఆర్ పాఠశాలలో 1వ తరగతి చదువుతున్న గుత్తా మాసన(7)ను అదే పాఠశాలకు చెందిన బాలుడు మభ్యపెట్టి మంగళవారం పెన్నానది ఒడ్డుకు తీసుకువెళ్లాడు. అదే సమయంలో నలుగురు యువకులు అక్కడికి చేరుకుని బాలికపై అత్యాచారం జరిపారు. అనంతరం బాలికను చంపి మృతదేహాన్ని నదిలో పడేశారు.
సాయంత్రం అయినా బాలిక కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదుచేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా రాత్రి పదిన్నర సమయంలో బాలిక మృతదేహం నది పక్కన ముళ్లపొదల్లో కనిపించింది. ఈ సంఘటనకు సంబంధించి శ్రావణ్, శివశంకర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
పోలీసులు రంగ ప్రవేశం చేసి నంద్యాల వెంకటశివను ప్రశ్నించారు. వెంకటశివ తనకేమీ తెలీదని తన గ్రామానికి చెందిన నంద్యాల శ్రావణ్ అనే డ్రైవర్ చెపితే తాను పాపను పిలుచుకెళ్లానని చెప్పాడు. దీంతో శ్రావణ్‌ను విచారించగా పాపను చంపి పడేసిన ముళ్లపొదలను చూపాడు. అయితే పాపను ఎందుకు హత్యచేశాడన్న విషయం పోలీసు విచారణలో తేలాల్సివుంది.












Click it and Unblock the Notifications