మేనమామ, వైయస్ బాబుకు అప్పగించారు: జెసి

JC Diwakar Reddy
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు తమ మేనమామ అని కాంగ్రెసు సీనియర్ శాసనసభ్యుడు, మాజీ మంత్రి జేసీ దివాకరరెడ్డి అన్నారు. కాంగ్రెస్ శాసనసభా పక్ష కార్యాలయంలో బుధవారం ఆయన ఇష్టాగోష్టిగా మాట్లాడారు. సహజంగా తల్లి చనిపోతూ తన బిడ్డలను మేనమామ చేతుల్లో పెట్టి వారి ఆలనా పాలనా చూసుకోవాలంటూ అప్పగింతలు పెడుతుందని అన్నారు.

అదే విధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోతూ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుల బాగోగులను చంద్రబాబుకు అప్పగించారని అన్నారు. అందువల్లే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఎలాంటి కష్టం రాకుండా కాపాడుతున్నారని ఆయన అన్నారు. చంద్రబాబు ఉన్నంత కాలం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎలాంటి ఢోకాలేదని అన్నారు.

ఇదిలావుంటే, వైయస్సార్ కాంగ్రెసు, కాంగ్రెస్ పార్టీల మధ్య పొత్తు కుదిందని అనుకుంటున్నారని మంత్రి కోండ్రు మురళీ మోహన్ అన్నారు. బుధవారం అసెంబ్లీ లాబీల్లో మీడియాతో ఆయన ఇష్టాగోష్టిగా మాట్లాడారు.

ఎప్పటికైనా కాంగ్రెస్‌లో వైయస్సార్ కాంగ్రెసు విలీనం కావాల్సిందే కదా అని ఢిల్లీలో ఒక నేత అన్నారని ఆయన చెప్పారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ కూడా వాళ్ల పార్టీ ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ విషయంలో మెతక వైఖరిని వ్యవహరించాలని సూచిస్తున్నట్లుగా ఒక నేత వివరించారన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+