ప్యాకేజీల కోసమే తోకపార్టీలు: మోత్కుపల్లి, దానం సెటైర్

అలాంటప్పుడు వారిని ఎలా నమ్మాలని ప్రశ్నించారు. సమయం, సందర్భం వచ్చినప్పుడు తామే ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెడతామన్నారు. ఇప్పుడు అవిశ్వాసమంటున్న తోక పార్టీలు వారి స్వప్రయోజనాల కోసమే పెడుతున్నాయన్నారు. గతంలో తాము వైయస్, కిరణ్ ప్రభుత్వాలపై పెట్టామన్నారు. తమకు ఎవరితోను మ్యాచ్ ఫిక్సింగ్ లేదన్నారు. కాంగ్రెసుతో తెరాస చాలా సందర్భాల్లో లాలూచీ పడిందన్నారు. నల్గొండ, వరంగల్ జిల్లాలకు ఎస్సారెస్సీ నీటిని విడుదల చేయమని తాము మంత్రిని కోరామని, ఆయన అంగీకరించారని మోత్కుపల్లి ఎర్రబెల్లి అన్నారు. రేపటిలోగా నీటిని విడుదల చేయకుంటే ముఖ్యమంత్రి చాంబర్ వద్ద ధర్నా చేస్తామన్నారు.
అవిశ్వాసంపై దానం సెటైర్
తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానం పెట్టడం లేదంటే తమ పార్టీ సమర్థవంతంగా పని చేస్తున్నట్లేనని మంత్రి దానం నాగేందర్ సెటైర్ వేశారు. తమకు టిడిపితో లోపాయికారి ఒప్పందం లేదన్నారు. టిడిపితో లోపాయికారి ఒప్పందముంటే తమకే నష్టమన్నారు.
బాంబు పేలుళ్లకు సంతాపం
పది గంటలకు ప్రారంభమైన శాసనసభ దిల్‌సుఖ్ నగర్ బాంబు పేలుళ్లపై రెండు నిమిషాల పాటు మౌనం పాటించి సంతాపం తెలిపింది. పేలుళ్లను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పింది.
అవిశ్వాసంపై చర్చ జరగాల్సిందే
అవిశ్వాసంపై చర్చ జరగాల్సిందేనని అయితే మిగిలిన సమస్యలపై చర్చ జరగాలా వద్దా చెప్పాలని లోక్ సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ విపక్షాలను ప్రశ్నించారు. సభను అడ్డుకుంటే తమ గొప్పగా ప్రతిపక్షాలు, వాయిదా పడితే తమ వ్యూహంగా అధికార పార్టీ భావిస్తోందని ఇది సరికాదన్నారు. అవిశ్వాసంతో పాటు అన్ని సమస్యలపై చర్చ జరగాల్సిందే అన్నారు. చట్ట సభలపై ప్రజలకు విశ్వాసం సన్నగిల్లుతోందన్నారు. మనల్ని గెలిపించిన ప్రజల కోసం ఆలోచించాలని సూచించారు. తమకు సంఖ్యా బలం లేకున్నా నైతిక బలముందన్నారు.












Click it and Unblock the Notifications