హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏడో'సారీ': మళ్లీ గాలికి సిబిఐ కోర్టులో చుక్కెదురు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Gali Janardhan Reddy
హైదరాబాద్: కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డికి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ) కోర్టులో మరోసారి చుక్కెదురయింది. సిబిఐ కోర్టు ఆయన ఏడవ బెయిల్ పిటిషన్‌ను గురువారం కొట్టేసింది. ఓబుళాపురం మైనింగ్ కార్పోరేషన్ కేసులో గాలి జనార్ధన్ రెడ్డి నిందితుడు. సంవత్సరంన్నర క్రితం అరెస్టయిన అతను పలుమార్లు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నా రాలేదు. ఈ రోజు ఆయన ఏడవ బెయిల్‌ను సిబిఐ కోర్టు కొట్టేసింది.

కాగా, గత వారం గాలి బెయిల్ పిటిషన్ పైన సిబిఐ న్యాయస్థానంలో వాదనలు జరిగిన విషయం తెలిసిందే. సిబిఐ తన పరిధిలో లేని అంశాల్లో జోక్యం చేసుకుంటూ బెయిలును అడ్డుకోవడానికి ప్రయత్నిస్తోందని గాలి జనార్ధన్ తరఫు న్యాయవాది సిబిఐ న్యాయస్థానానికి చెప్పారు. అక్రమ తవ్వకాలు జరిగిన ప్రదేశాలను గుర్తించాలని చెబుతోందని, సరిహద్దులు తేలకుండా దీన్ని ఎలా నిర్దారిస్తుందని ప్రశ్నించారు.

ఒకవేళ నేరం రుజువైతే పడే శిక్షకంటే ఎక్కువకాలం గాలిని జైల్లో ఉంచాలని సిబిఐ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఆ సంస్థ దర్యాఫ్తులోనే లోపాలున్నాయని, కర్నాటకలోని కేసులను ప్రస్తావిస్తూ ఇక్కడ బెయిలును అడ్డుకోవడం సరికాదన్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన లీజుల్లో తవ్వకాలే జరపలేదని సిబిఐ చెబుతోందని, అలాంటప్పుడు అక్రమ మైనింగుకు అవకాశం ఎక్కడిదని వాదించారు. ఇరువైపుల వాదనల అనంతరం ఈ రోజు గాలి బెయిల్ పిటిషన్‌ను కోర్టు నిరాకరించింది.

శ్రవణ్ గుప్తాకు అనుమతి

ఎమ్మార్ ఎంజిఎఫ్ ఎండి శ్రవణ్ గుప్తాకు లండన్, దుబాయ్ వెళ్లేందుకు సిబిఐ కోర్టు గురువారం అనుమతిని ఇచ్చింది. ఆరు లక్షల రూపాయల పూచికత్తును సమర్పించి విదేశీ పర్యటనకు వెళ్లాలని ఆదేశించింది.

రవీంద్రనాథ్ రెడ్డి కేసు

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి మేనమామ, కడప మాజీ మేయర్ రవీంద్రనాథ్ రెడ్డికి సత్యోశోధన పరీక్షలు జరిపేందుకు అనుమతివ్వాలని పోలీసులు కడప జిల్లా కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను స్వీకరించిన కోర్టు దీనిపై విచారణను ఈ నెల 19వ తేదికి వాయిదా వేసింది.

English summary
A special CBI court here on Thursday, dismissed the bail plea of mining baron and former Karnataka Minister Gali Janardhan Reddy, an accused in the illegal mining case involving his Obulapuram Mining Company (OMC).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X