జగ్గారెడ్డి X ఈటెల: ఏం చేస్తావో చేస్కో: కిరణ్ వార్నింగ్

మెదక్ అభివృద్ధిలో..
మెదక్ జిల్లా గతంలో ఎన్నడూ లేనంతగా అభివృద్ధి చెందుతోందని, సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా కాంగ్రెసు పార్టీ పని చేస్తోందన్నారు. వ్యవసాయ, ఉన్నత విద్యా సంస్థలు జిల్లాకు తెచ్చామన్నారు. ఏ జిల్లాకు ఏది అవసరమో అది ఇవ్వడమే కాంగ్రెసు లక్ష్యమన్నారు.
హరీష్‌కు కిరణ్ వార్నింగ్
ఈ సమయంలో హరీష్ రావు మాట్లాడుతూ అన్యాయం జరిగిందని మరోసారి చెప్పారు. హరీష్ ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. కాలర్ పట్టుకొని అడిగితే కొన్ని ఇచ్చారన్నారు. దానికి కిరణ్ లేచి హరీష్ రావుకు వార్నింగ్ ఇచ్చారు. మీకు భయపడి మేము పని చేయడం లేదన్నారు. హరీష్ రావు రౌడీలా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఇలా ఎక్కువ చేస్తే ఒక్క రూపాయి కూడా ఇచ్చేది లేదన్నారు. ఏం చేస్తావో చేస్కో అన్నారు. హరీష్ రావుకు భయపడి పని చేయడం లేదన్నారు. హరీష్ తన భాషమార్చుకోవాలన్నారు.
కిరణ్ క్షమాపణ చెప్పాలి
తెలంగాణకు ఒక్కరూపాయి కూడా ఇవ్వనని కిరణ్ అనడం సరికాదని ఆయన క్షమాపణలు చెప్పాలని ఈటెల రాజేందర్ డిమాండ్ చేశారు. కెసిఆర్ కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణకు ఎంతో చేశారన్నారు. సభలో కెసిఆర్ గురించి మాట్లాడటం సంస్కారం కాదన్నారు. తెలంగాణ ప్రాంతం నుండి 70 శాతం పన్నులు వస్తుంటే.. 70 శాతం నిధులు ఆంధ్రకా అని ప్రశ్నించారు. ఒక్క నియోకవర్గం ప్రజలు ఓటేస్తే గెలిచారన్నారు. ముఖ్యమంత్రి రాష్ట్రం మొత్తాన్ని సమానంగా చూడాలన్నారు.












Click it and Unblock the Notifications