'సమ్మె వల్ల సిఎంకు జీతం రాలేదు: పేరులో అన్యాయం'

రాష్ట్రానికి పేరు పెట్టడంలో అన్యాయం
రాష్ట్రానికి పేరు పెట్టడంలో కూడా కాంగ్రెసు తెలంగాణకు అన్యాయం చేసిందన్నారు. తెలంగాణాంధ్రను ఆంధ్రప్రదేశ్‌గా మార్చి మోసం చేసిందన్నారు. పెద్ద మనుషులు ఒప్పందాన్ని తుంగలో తొక్కారని, స్వర్గీయ నందమూరి తారక రామారావు తెచ్చిన 610 జివోను ఇప్పటి దాకా అమలు చేసిన దాఖలులు లేవన్నారు. 2004లో తెరాసతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెసు పార్టీ అధికారంలోకి వచ్చాక ఇచ్చిన మాటను మర్చిందన్నారు.
కరీంనగర్ సభలో సోనియా గాంధీ స్వయంగా తెలంగాణపై హామీ ఇచ్చారన్నారు. తెలంగాణ కోసం పోరాడిన కాంగ్రెసు నేతలు ఇప్పుడు మంత్రులుగా ఉన్నారన్నారు. కాంగ్రెసు పార్టీ పుట్టింది ద్రోహంతో అన్న భావన కలుగుతోందన్నారు. దేశంలోని 33 పార్టీలు తెలంగాణకు మద్దతు ప్రకటించాయన్నారు. ఈ సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు అన్యాయం జరుగుతోందన్నారు. తెలంగాణ ఆకాంక్ష రాజకీయ డిమాండ్ కాదని చెప్పారు.
తెలంగాణ ఇస్తామని మాతో పొత్తు పెట్టుకొని కాంగ్రెసు పార్టీ మోసం చేసిందన్నారు. తెలంగాణ ప్రజల ఉసురు పోసుకుంది కాంగ్రెసు పార్టీయే అన్నారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా తెలంగాణకు మోసం చేశాయన్నారు. మొత్తం రాజ్యాంగాన్నే మార్చిన చరిత్ర కాంగ్రెసుదే అన్నారు. ఎప్పుడు ఏ పార్టీ కాంగ్రెసులో ఉంటారో ప్రస్తుతం అర్థం కాకుండా ఉందన్నారు. అవిశ్వాసం పెట్టడం బాధాకరమైనా తప్పలేదన్నారు.
ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఆంధ్రా వలస దోపిడీదారులకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నామన్నారు. తెలంగాణ ప్రజలు ప్రభుత్వాల కంటే పోరాటాలనే నమ్ముకున్నారన్నారు. తెలంగాణ ప్రజల బాధ రాస్తే రామాయణం.. చెప్తే భారతం అవుతుందన్నారు. శ్రీకృష్ణ కమిటీ రిపోర్టుపై హైకోర్టే తేల్చిందని, ఆది బోగస్ కమిటీ అన్నారు. తెలంగాణపై కేంద్రం నాన్చివేత ధోరణి అవలంబిస్తోందన్నారు. 1956లోనే తాము తెలంగాణ విలీనాన్ని వ్యతిరేకించామన్నారు.
సకల జనుల సమ్మె వల్ల ముఖ్యమంత్రికి జీతం రాలేదు
తెలంగాణ కోసం జరిగిన సకల జనుల సమ్మె కారణంగా ముఖ్యమంత్రికే జీతం రాని పరిస్థితి వచ్చిందన్నారు. పార్లమెంటును కుదిపేసిందని, ప్రధానమంత్రి స్వయంగా సమ్మె విరమించాలని విజ్ఞప్తి చేశారన్నారు. తెలంగాణపై తేల్చుతామని చెప్పిన కేంద్రం ఆ తర్వాత దసరా, దీపావళి, బక్రీద్ అంటూ నాన్చివేసిందన్నారు. ఎఫ్‌డిఐల సమయంలోను కేంద్రం తెలంగాణపై మోసం చేసిందన్నారు. తెలంగాణపై నిర్ణయం తీసుకుంటున్నామని చెప్పి అఖిల పక్షాన్ని పిలిచి మోసం చేసిందన్నారు.
తెలంగాణ రాజకీయ నినాదం కాదని... ప్రజల ఆకాంక్ష అన్నారు. 1969 పోరాటాన్ని రక్తసిక్తం చేసిన చరిత్ర కాంగ్రెసుదే అన్నారు. తెలంగాణ ప్రాంతం నిత్యం దోపిడీకి గురైందన్నారు. తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకున్న అమరవీరులకు సభలో ఎప్పుడు సంతాపం తెలుపలేదన్నారు. కాంగ్రెసు పార్టీ మూడు వందల మంది విద్యార్థులను చంపిందన్నారు.
గండ్ర వివరణ
తెలంగాణ అమర వీరులకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా సంతాపం తెలిపి, ఆత్మహత్యలు వద్దని సూచించారని,
తెలంగాణపై నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్రం అని చెప్పారు.
గండ్ర వర్సెస్ హరీష్
ముఖ్యమంత్రి నిన్ననే విస్తరణ గురించి మాట్లాడారని, ఆయన మంత్రి పదవి కోసం చూస్తున్నట్లుగా ఉన్నారని హరీష్ అన్నారు. కెసిఆర్ ప్రాపకం కోసం హరీష్ చూస్తున్నారని గండ్ర అన్నారు. అందుకు హరీష్ మాట్లాడుతూ.. తమ ఉద్యమం కారణంగానే గండ్ర చీఫ్ విప్ అయ్యారన్నారు. పిసిసి చీఫ్, సిఎం, స్పీకర్ అందరూ సీమాంధ్రులే అన్నారు.












Click it and Unblock the Notifications