వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాష్ట్రం పేరులోను మోసం: సభలో హరీష్ స్పీచ్...

By Srinivas
|
Google Oneindia TeluguNews

Harish Rao
హైదరాబాద్: తెలంగాణ ప్రజలను మోసం చేసిన చరిత్ర కాంగ్రెసు పార్టీది అని తెలంగాణ రాష్ట్ర సమితి సిద్దిపేట శాసనసభ్యుడు హరీష్ రావు అన్నారు. శుక్రవారం అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం నోటీసు పైన చర్చ ప్రారంభమైంది. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడారు. తెలంగాణ ఉద్యమానికి కాంగ్రెసు పార్టీ మొదటి నుండి మోసం చేసిందన్నారు. అన్ని పార్టీలు తెలంగాణ ప్రజలను వంచించాయన్నారు.

రాష్ట్రానికి పేరు పెట్టడంలో అన్యాయం

రాష్ట్రానికి పేరు పెట్టడంలో కూడా కాంగ్రెసు తెలంగాణకు అన్యాయం చేసిందన్నారు. తెలంగాణాంధ్రను ఆంధ్రప్రదేశ్‌గా మార్చి మోసం చేసిందన్నారు. పెద్ద మనుషులు ఒప్పందాన్ని తుంగలో తొక్కారని, స్వర్గీయ నందమూరి తారక రామారావు తెచ్చిన 610 జివోను ఇప్పటి దాకా అమలు చేసిన దాఖలులు లేవన్నారు. 2004లో తెరాసతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెసు పార్టీ అధికారంలోకి వచ్చాక ఇచ్చిన మాటను మర్చిందన్నారు.

కరీంనగర్ సభలో సోనియా గాంధీ స్వయంగా తెలంగాణపై హామీ ఇచ్చారన్నారు. తెలంగాణ కోసం పోరాడిన కాంగ్రెసు నేతలు ఇప్పుడు మంత్రులుగా ఉన్నారన్నారు. కాంగ్రెసు పార్టీ పుట్టింది ద్రోహంతో అన్న భావన కలుగుతోందన్నారు. దేశంలోని 33 పార్టీలు తెలంగాణకు మద్దతు ప్రకటించాయన్నారు. ఈ సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు అన్యాయం జరుగుతోందన్నారు. తెలంగాణ ఆకాంక్ష రాజకీయ డిమాండ్ కాదని చెప్పారు.

తెలంగాణ ఇస్తామని మాతో పొత్తు పెట్టుకొని కాంగ్రెసు పార్టీ మోసం చేసిందన్నారు. తెలంగాణ ప్రజల ఉసురు పోసుకుంది కాంగ్రెసు పార్టీయే అన్నారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా తెలంగాణకు మోసం చేశాయన్నారు. మొత్తం రాజ్యాంగాన్నే మార్చిన చరిత్ర కాంగ్రెసుదే అన్నారు. ఎప్పుడు ఏ పార్టీ కాంగ్రెసులో ఉంటారో ప్రస్తుతం అర్థం కాకుండా ఉందన్నారు. అవిశ్వాసం పెట్టడం బాధాకరమైనా తప్పలేదన్నారు.

ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఆంధ్రా వలస దోపిడీదారులకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నామన్నారు. తెలంగాణ ప్రజలు ప్రభుత్వాల కంటే పోరాటాలనే నమ్ముకున్నారన్నారు. తెలంగాణ ప్రజల బాధ రాస్తే రామాయణం.. చెప్తే భారతం అవుతుందన్నారు. శ్రీకృష్ణ కమిటీ రిపోర్టుపై హైకోర్టే తేల్చిందని, ఆది బోగస్ కమిటీ అన్నారు. తెలంగాణపై కేంద్రం నాన్చివేత ధోరణి అవలంబిస్తోందన్నారు. 1956లోనే తాము తెలంగాణ విలీనాన్ని వ్యతిరేకించామన్నారు.

సకల జనుల సమ్మె వల్ల ముఖ్యమంత్రికి జీతం రాలేదు

తెలంగాణ కోసం జరిగిన సకల జనుల సమ్మె కారణంగా ముఖ్యమంత్రికే జీతం రాని పరిస్థితి వచ్చిందన్నారు. పార్లమెంటును కుదిపేసిందని, ప్రధానమంత్రి స్వయంగా సమ్మె విరమించాలని విజ్ఞప్తి చేశారన్నారు. తెలంగాణపై తేల్చుతామని చెప్పిన కేంద్రం ఆ తర్వాత దసరా, దీపావళి, బక్రీద్ అంటూ నాన్చివేసిందన్నారు. ఎఫ్‌డిఐల సమయంలోను కేంద్రం తెలంగాణపై మోసం చేసిందన్నారు. తెలంగాణపై నిర్ణయం తీసుకుంటున్నామని చెప్పి అఖిల పక్షాన్ని పిలిచి మోసం చేసిందన్నారు.

ముఖ్యమంత్రులు మారినా తెలంగాణపై వివక్ష మారలేదన్నారు. కాకతీయ ఉత్సవాలకు డబ్బులివ్వని కిరణ్ చిత్తూరు ఉత్సవాలకు మాత్రం ఆరువేల కోట్లు ఇచ్చారన్నారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు కడపను అభివృద్ధి చేయగా.. కిరణ్ చిత్తూరును చేస్తున్నారన్నారు. తెలంగాణను పట్టించుకునే వారు లేకుండా పోయారన్నారు. మెదక్ అల్లాడుతున్నా చుక్కా నీరు లేదన్నారు. తెలంగాణను ఇడ్లి, దోశలతో పోల్చి కాంగ్రెసు పార్టీ అవమానించిందన్నారు.

ఎన్టీఆర్ దెబ్బకు కాంగ్రెస్ ఔట్ అయితే

స్వర్గీయ నందమూరి తారక రామారావు దెబ్బకు కాంగ్రెసు పార్టీ రాష్ట్రంలో తుడిచి పెట్టుకుపోతే తెలంగాణనే ఆ పార్టీని ఆదుకున్నదన్నారు. ప్రతిపక్ష టిడిపి ఎమ్మెల్యేలను కిరణ్ వలలో వేసుకున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రాంత కార్మికుల పట్ల కూడా వివక్ష చూపిస్తున్నారన్నారు. నాలుగు జిల్లాలున్న రాయలసీమ ప్రాంతంలో మూడు జెఎన్డీయులుంటే పది జిల్లాలున్న తెలంగాణలో ఎనిమిది జెఎన్టీయులు ఉండాలన్నారు.

సిఎం బ్లాక్ మెయిల్

తెలంగాణ ప్రాంతానికి ప్రభుత్వాలు నిధులు ఇవ్వడం లేదని, కాలర్ పట్టుకుని అడిగితేనే నిజామాబాద్ కళాశాలకు నిధులు కేటాయించారని అన్నారు. దానికి కిరణ్ ఘాటుగా స్పందించి.. మేం తెలంగాణ ప్రాంతానికి కూడా ప్రాధాన్యత ఇస్తున్నామని, భయపెడితే పనులు చేయడం లేదని, అలా చేస్తే ఒక్క రూపాయి కూడా ఇవ్వమన్నారు. మీకు భయపడి మేము పని చేయడం లేదన్నారు. హరీష్ రావు రౌడీలా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఇలా ఎక్కువ చేస్తే ఒక్క రూపాయి కూడా ఇచ్చేది లేదన్నారు. ఏం చేస్తావో చేస్కో అన్నారు. హరీష్ రావుకు భయపడి పని చేయడం లేదన్నారు. హరీష్ తన భాషమార్చుకోవాలన్నారు.

ఆ తర్వాత ఇరువురు తమ తమ వ్యాఖ్యలపై వివరణ ఇచ్చుకున్నారు. తాను తెలంగాణ ఉద్యమం కాలర్ పడితే నిధులు ఇస్తున్నారని చెప్పానని హరీష్ చెప్పగా.. ఒక్కరూపాయి ఇవ్వనని చెప్పింది తాను హరీష్‌ను ఉద్దేశించి అని కిరణ్ చెప్పారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలు బ్లాక్ మెయిలింగ్‌గా ఉన్నాయని హరీష్ చెప్పగా.. తాను ఎవరికీ భయపడనని, భయపడితే అంతకంటే ఎక్కువే మాట్లాడుతానని చెప్పారు. అనంతరం ఇరువురు నేతలు తమ వ్యాఖ్యలు ఉపసంహరించుకున్నారు. ప్రాధాన్యతను బట్టి నిధులు కేటాయిస్తామన్నారు. మెదక్‌లో ట్రాక్టర్ ఫ్యాక్టరీ ఇటీవలె తెచ్చామన్నారు. తెలంగాణపై ప్రేమతో ఎన్నో పనులు చేస్తున్నానని చెప్పారు.

ప్రాధాన్యతను బట్టి నిధులు కేటాయిస్తే తెలంగాణకు ఇంకా ఎక్కువ రావాల్సి ఉందన్నారు. తెలంగాణ ప్రాంతానికి రావాల్సిన సైనిక్ స్కూలును చిత్తూరు జిల్లాకు తీసుకు వెళ్లారని హరీష్ రావు ఆరోపించారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు లేవని ప్రశ్నిస్తే వచ్చాయన్నారు. కానీ ఇప్పటి వరకు అవి పూర్తి కాలేదన్నారు. ప్రజల పక్షాన మేం పోరాడి సమస్యలను పరిష్కరించుకుంటామని చెప్పారు.

కాంగ్రెసు పార్టీ రైతులకు ఏడు లేదా తొమ్మిది గంటల విద్యుత్ ఇస్తుందా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కిరణ్ రాజీవ్ యువకిరణాలు ప్రవేశ పెట్టినా ప్రజల్లో కిరణాలు ఏమీ కనిపించడం లేదన్నారు. సామాన్యులపై విద్యుత్ భారం బాగా పడుతోందన్నారు. విద్యుత్ శాఖకు మంత్రి లేకుండా పోయారన్నారు. రైతుల ఆత్మహత్యకు ప్రభుత్వ వైఫల్యమే కారణమన్నారు. విద్యుత్ బిల్లును పట్టుకుంటేనే గుండెపోటు వస్తోందన్నారు.

దేశంలో అత్యధిక ఆత్మహత్యలు తెలంగాణలో జరుగుతున్నాయన్నారు. బాబ్లీపై సుప్రీం కోర్టులో ప్రభుత్వం సరైన వాదనలు వినిపించలేదన్నారు. కాంతానపల్లి ప్రాజెక్టుపై నిర్లక్ష్యం ఎందుకన్నారు. ప్రాణహితను ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, మరో ముప్పై ఏళ్లయినా పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదన్నారు.

ప్రభుత్వ వైఖరితో ఎస్సారెస్సీలోకి నీళ్లు రావడం లేదన్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా అని ప్రశ్నించారు. తెలంగాణ జిల్లాల్లో పూర్తిగా కరువు కొట్టుమిట్టాడుతోందన్నారు. ప్రభుత్వం ప్రకటించిన కరువు మండలాల్లో సీమాంధ్రలో 218 ఉంటే పదహారు మాత్రమే తెలంగాణ మండలాలు ఉన్నాయన్నారు. కాంగ్రెసు మేనిఫెస్టోను అమలుపర్చడం లేదన్నారు. విద్యుత్ కేటాయింపుల్లో కూడా తెలంగాణ రైతులకు అన్యాయం జరుగుతోందన్నారు. తెలంగాణ రైతుకు కనీసం నాలుగైదు గంటల విద్యుత్ కూడా ఇవ్వట్లేదన్నారు.

రూపాయికి కిలో బియ్యం..

కాంగ్రసెు మేనిఫెస్టోను క్రమంగా అమలు పరుస్తోందన్నారు. వచ్చే ఎన్నికల్లోపు మేనిఫెస్టోలోని అన్ని అంశాలను పరిశీలిస్తామన్నారు. ఆహార భద్రత బిల్లును కేంద్రం తీసుకు వస్తుందన్నారు. ప్రజల కోసం ఒక్క రూపాయికి కిలో బియ్యం ఇస్తున్నామన్నారు. రూపాయికి కిలో బియ్యం ఇస్తున్నా ప్రజలకు ఏమాత్రం ప్రయోజనం చేకూరడం లేదని హరీష్ రావు అన్నారు.

English summary
Telangana Rastra Samithi LP Etela Rajender has introduced No Confidence Motion in Assembly on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X