హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

'పరిటాల సహా 500 మందిని చంపిన వారితో దోస్తీయా?'

By Srinivas
|
Google Oneindia TeluguNews

Payyavula Keshav
హైదరాబాద్: తమ పార్టీకి చెందిన సీనియర్ నేత పరిటాల రవీంద్రతో సహా ఐదు వందల మంది పార్టీ కార్యకర్తలను పొట్టన పెట్టుకున్న కాంగ్రెసు పార్టీతో తాము కలుస్తామా? అని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ శుక్రవారం సభలో అవిశ్వాసం తీర్మానం సందర్భంగా ప్రశ్నించారు. వైయస్సార్ కాంగ్రెసు పదే పదే తాము అధికార పార్టీతో కుమ్మక్కయ్యామని చెబుతుంటే తమ గుండెల్లో గునపాలు గుచ్చినట్లుగా ఉందన్నారు.

తమ పార్టీ వారిని చంపిన కాంగ్రెసుతో దోస్తీ అంటే మాకు చాలా బాధేస్తుందన్నారు. తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి బెయిల్ వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీయే అధికార పార్టీతో కుమ్మక్కై తమను విమర్శిస్తే చూస్తూ కూర్చోవాలా అని ప్రశ్నించారు. తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఎప్పుడో తొమ్మిదేళ్ల కింద పాలిస్తే ఆయన పాలన గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెసు వ్యతిరేక పునాదులపై పుట్టిన పార్టీ టిడిపి అన్నారు. అలాంటి పార్టీతో కలవాల్సిన అవసరం తమకు లేదన్నారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ఎండగట్టేందుకే వచ్చామన్నారు.

లక్ష కోట్లు దోచుకుంటే చూస్తూ కూర్చోవాలా?

సిబిఐ ఎఫ్ఐఆర్‌లో వైయస్ పేరు ఉన్నందువల్లే తాను ఆ పేరును ప్రస్తావించానని మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. లక్ష కోట్లు దోచుకుంటే చూస్తూ కూర్చోవాలా అన్నారు. కోట్లు దండుకొని ఇంట్లో దేవుడి ఫోటో పెట్టుకుంటే క్షమిస్తారా అన్నారు. జగన్ పార్టీకి మనసుంటే పశ్చాత్తాపం ప్రకటించాలన్నారు. జగన్, వైయస్‌ల పేర్లు ఎఫ్ఐఆర్‌లో ఉన్నాయన్నారు. అందుకే ఆ పార్టీ ఎమ్మెల్యేలు అప్పట్లో రాజీనామా చేశారన్నారు. 2004-2009 వరకు కాంగ్రెసు పార్టీ ముఖ్యమంత్రి ఎవరన్నారు.

English summary
Telangana Rastra Samithi LP Etela Rajender has introduced No Confidence Motion in Assembly on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X