'వైయస్ జగన్‌కు లొంగిన కెసిఆర్: తెలంగాణకు నీళ్లు!'

K Chandrasekhar Rao - YS Jagan
హైదరాబాద్: బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానంలో ఆ పార్టీ తెలంగాణకు నీళ్లు వదిలేసిందా? అంటే అవుననే ఆరోపిస్తున్నారు తెలుగుదేశం పార్టీ నేత రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర సమితి అందజేసిన అవిశ్వాస తీర్మానం నోటీసులో ఎక్కడా తెలంగాణ అంశాన్ని ప్రస్తావించలేదని ఆరోపించారు. తెరాస నోటీసులో ఎక్కడా తెలంగాణ అంశాన్ని ఎందుకు చేర్చలేదో చెప్పాలని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

ఇడుపులపాయ ముడుపులకు ఆశపడ్డ కెసిఆర్ తెలంగాణను పక్కన పెట్టినట్లుగా కనిపిస్తున్నాయన్నారు. తెరాస కార్యాలయానికి తెలంగాణ భవన్ అని తీసివేసి ముడుపుల భవన్ అని పేరు పెట్టుకోవాలని ఎద్దేవా చేశారు. నోటీసులో తెలంగాణకు నీళ్లు వదిలేసిన తెరాస అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఇక సీమాంధ్రలోనే పోటీ చేయాల్సి ఉంటుందన్నారు. సీమాంధ్ర నేతల ఒత్తిడికి తలొగ్గి ఆయన తెలంగాణను పక్కన పెట్టినట్లుగా కనిపిస్తోందన్నారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డితో కెసిఆర్ కుమ్మక్కయ్యారని ఆరోపించారు. ఆయనకు లొంగినందువల్లే అవిశ్వాస తీర్మానంలో తెలంగాణను ప్రస్తావించలేదన్నారు. అదే సమయంలో ఇరు పార్టీలు వేర్వేరుగా నోటీసులు ఇవ్వడం ద్వారా ప్రభుత్వాన్ని రక్షించే ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు. తోక పార్టీలు రెండు వేర్వేరుగా ఎందుకు తీర్మానాలు ఇచ్చాయో మొదట చెప్పాలన్నారు.

తెలంగాణను ప్రస్తావించని కెసిఆర్‌కు తెలంగాణలో తిరిగే నైతిక హక్కు లేదన్నారు. అవిశ్వాస తీర్మానంలో తెలంగాణను చేర్చక పోవడం ద్వారా తెరాస అసలు రంగు బయటపడిందన్నారు. ప్రజలు తెలంగాణ రాష్ట్ర సమితి తీరును గమనిస్తున్నారని చెప్పారు. కాగా పది గంటలకు అసెంబ్లీ తిరిగి ప్రారంభమైంది. ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+