పొత్తులతో నష్టపోయాం, ఒంటరి పోటీయే: చంద్రబాబు

Chandrababu Naidu
ఏలూరు: వచ్చే ఎన్నికల్లో తాము ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోబోమని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గతంలో పొత్తుల కారణంగానే నష్టపోయామని ఆయన అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో పాదయాత్ర సాగిస్తున్న ఆయన ఆ విషయం చెప్పారు. కార్యకర్తలే పార్టీకి వెన్నెముక అని, కార్యకర్తలు చేసిన త్యాగాల ఫలితంగానే పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావుకు, తనకు పేరు ప్రఖ్యాతులు వచ్చాయని ఆయన అన్నారు.

పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు, ఆచంట నియోజకవర్గాల సమీక్షా సమావేశాల్లో ఆయన మాట్లాడారు. కొంత మంది కార్యకర్తలు తమ ప్రాణాలను కూడా త్యాగం చేశారని ఆయన అన్నారు. కొద్ది మంది నాయకులు పార్టీని విడిచి వెళ్లారే గానీ కార్యకర్తలు పార్టీలోనే కొనసాగుతున్నారని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల నాటికి కార్యకర్తలపై గురుతర బాధ్యత ఉందని ఆయన అన్నారు.

ప్రజలను పార్టీకి అనుకూల ఓటర్లుగా మార్చే బాధ్యత కార్యకర్తలపై ఉందని చంద్రబాబు చెప్పారు. కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టి రసాభాస చేశారని ఆయన విమర్శించారు.

రెడ్డీస్ ల్యాబ్స్ వ్యవస్థాపకుడు డాక్టర్ అంజిరెడ్డి మృతికి చంద్రబాబు నాయుడు సంతాపం ప్రకటించారు. అంజిరెడ్డి శుక్రవారం కన్నుమూసిన విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+