ఒకటికి రెండుసార్లు చదివి.. సభలో మళ్లీ తడబడిన షిండే

అయితే పొరబాటున ఇదే ప్రకటనను రెండుసార్లు చదివారు. మొదటిసారి చదివిన షిండే మర్చిపోయి మరోసారి చదివారు. దీంతో భారతీయ జనతా పార్టీ సహా ప్రతిపక్ష సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బిజెపి సభ్యులు ఈ విషయాన్ని స్పీకర్ మీరా కుమార్ దృష్టికి తీసుకు వెళ్లాయి. బిజెపి ఓ వైపు చెబుతున్నా షిండే మాత్రం అదేమీ పట్టించుకోకుండా రెండోసారి చదవడం కొనసాగించారు.
లోకసభ అధికారి ఒకరు దగ్గరకు వచ్చి చెప్పిన తర్వాత గానీ ఆయన చదవడం ఆపలేదు. హోంమంత్రి మతిమరుపు ధోరణి చూసి అధికార, విపక్ష సభ్యులు ఆశ్చర్యపోయారు. అయితే, షిండే ఇలా మర్చిపోయి చదవడం, పొరబాటు చేయడం తొలిసారి కాదు. గతంలోను ఆయన రెండుమూడుసార్లు చేశారు.
కొన్ని వారాల క్రితం రాజ్యసభలో ఒఖ ప్రకటనను చదివి వినిపిస్తూ... మహారాష్ట్రలో అత్యాచారానికి, హత్యకు గురైన ముగ్గురు బాలికల పేర్లను ఆయన వెల్లడించారు. సుప్రీం కోర్టు నిబంధనల ప్రకారం అత్యాచార బాధితుల పేర్లను బహిర్గతపర్చకూడదు. ఈ విషయాన్ని షిండే మర్చిపోయారు.
అంతకుముందు పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి రెహ్మాన్ మాలిక్ భారత్ పర్యటన సందర్భంగా షిండే మాట్లాడుతూ.. ముంబయి దాడుల సూత్రధారిగా భావిస్తున్న జమాత్ ఉద్ దవా అధిపతి హఫీజ్ సయిద్‌ను శ్రీ, మిస్టర్ అంటూ సంబోధించడం వివాదాస్పదమయింది.












Click it and Unblock the Notifications