జగన్ ఎమ్మెల్యేలపై వేటు: గండ్ర, హవా తగ్గుతోంది: జెసి

Gandra Venkataramana Reddy-JC Diwakar Reddy
హైదరాబాద్: అవిశ్వాస తీర్మానం విషయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసి విప్ ధిక్కరించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వర్గం శానససభ్యులపై చర్యలు తీసుకోనున్నట్లు చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి తెలిపారు. శనివారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడారు. తొమ్మిది మంది ఎమ్మెల్యేలపై స్పీకర్‌కు మంగళవారం ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన చెప్పారు.

తమ పార్టీకి చెందిన 9 మంది శానససభ్యులను ప్రలోభ పెట్టారని, వారితో చీకటి ఒప్పందం చేసుకున్నారని ఆయన విమర్శించారు. ఒత్తిడి తెచ్చి జోగి రమేష్‌ను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు వారి వైపు లాక్కున్నారని ఆయన అన్నారు. వారిని శానససభలోకి అడుగు పెట్టనివ్వమని ఆయన అన్నారు. గతంలో విప్ ధిక్కరించిన ముగ్గురి చిరునామా గల్లంతైందని, ఈ 9 మంది భవిష్యత్తు కూడా అదే అవుతుందని ఆయన అన్నారు. వారు పశ్చాత్తాపపడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఆయన అన్నారు.

సహకార ఎన్నికల్లో తమకు ఓ మాత్రం పోటీ ఇవ్వని పార్టీలు తమపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించాయని ఆయన అన్నారు. ఈనెల 20న సీఎల్పీ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనారోగ్య కారణాల వల్లే మంత్రి వట్టి వసంత్‌కుమార్ సభకు హాజరుకాలేకపోయినట్లు విప్ గండ్ర వివరణ ఇచ్చారు.

అవిశ్వాస తీర్మానంలో ప్రభుత్వ విప్‌ను ధిక్కరించిన శాసనసభ్యులపై వేటు వేయడం మంచిదని కాంగ్రెస్ సీనియర్ శానససభ్యుడు జెసి దివాకర్‌ రెడ్డి తెలిపారు. శనివారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడారు. వీలైనంత త్వరగా ఉప ఎన్నికలకు వెళ్లాలని, ఒకట్రెండు స్థానాల్లో ఓడిపోయినా నష్టమేమి లేదని ఆయన అన్నారు. జగన్ ప్రభావం రోజురోజుకీ తగ్గుతోందని జెసి అభిప్రాయపడ్డారు.

సిఎంపై పొన్నం మండిపాటు

అసెంబ్లీలో తెలంగాణపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని కరీంనగర్ కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ అన్నారు. శనివారం ఉదయం ఆయన కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతేసేలా ఉన్నాయని మండిపడ్డారు. అసెంబ్లీలో అవిశ్వాసానికి అనుకూలంగా ఓటేసిన సీమాంధ్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+