హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నా వ్యాఖ్యలను వక్రీకరించారు, భయపడం: సిఎం

By Pratap
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
హైదరాబాద్: శానససభలో తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. తెలంగాణకు నిధులు ఇవ్వబోనని తాను అనలేదని, తన వ్యాఖ్యలను వక్రీకరించారని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. అవిశ్వాస తీర్మానంతో ఎవరి బలమేమిటో తేలయిందని ఆయన వ్యాఖ్యానించారు. రాజకీయ కారణాలతో వైయస్సార్ కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించాయని విమర్శించారు.

స్థానిక సంస్థల ఎన్నికలను ఏప్రిల్ చివరి వారంలో గానీ మే మొదటి వారంలో గానీ నిర్వహిస్తామని ఆయన చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలే సాధారణ ఎన్నికలకు గీటురాయి అని ఆయన అన్నారు. విప్‌ను ధిక్కరించిన తమ కాంగ్రెసు పార్టీ శానససభ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని, 15 రోజుల్లోగా స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తామని ఆయన చెప్పారు. ఉప ఎన్నికలకు తాను భయపడబోనని ఆయన చెప్పారు. ప్రభుత్వం మైనారిటీలో ఉందనేది అబద్ధమని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ మరోసారి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే భయపడబోమని, స్పీకర్ నిబంధనల ప్రకారం నిర్ణయం తీసుకుంటారని ఆయన అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆరో అభ్యర్థిని పెట్టినా గెలిచేవాళ్లమని ఆయన అన్నారు.

నిజమైన కార్యకర్తలకు టికెట్లు ఇవ్వలేదని

వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వలేదని ఎమ్మెల్యే నందీశ్వర్‌గౌడ్ ఆరోపించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఒత్తిళ్లకు తలొగ్గి పార్టీ సిద్దాంతాలకు తెలియని వారికే టికెట్లు ఇచ్చారన్నారు. అలాంటి వారే ప్రస్తుతం పార్టీని వీడుతున్నారని ఆయన అన్నారు. పార్టీకి వెన్ను పోటు పొడిచిన 9 మంది ఎమ్మెల్యేలలో ఐదారుగురు సీఎం ఆఫీసు చుట్టూ తిరిగారని, వారికే వంద కోట్ల నిధులిచ్చారని ఎమ్మెల్యే నందీశ్వర్‌గౌడ్ దుయ్యబట్టారు.

తెలంగాణ తీర్మానానికి కిషన్ రెడ్డి డిమాండ్

తెలంగాణపై అసెంబ్లీ తీర్మానం పెట్టాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణకు ఎవరు అనుకూలం, ఎవరు వ్యతిరేకమో అసెంబ్లీలో తేలాలని కిషన్‌రెడ్డి అన్నారు. తెలంగాణపై పార్లమెంటులో బిల్లు పెడితే 160 మంది బిజెపి ఎంపీల బాధ్యత తనదేనని ఆయన తెలిపారు. ఎంఐఎం నేతలపై పెట్టిన కేసులను ఎందుకు నీరుగార్చేలా చేస్తున్నారని కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తపరిచారు.

English summary
CM Kiran Kumar Reddy said that his words on Telangana were twisted. He never denied release of funds to Telangana, he told.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X