టిడిపి క్యాడర్ దూరం: బాలయ్యపై జూ ఎన్టీఆర్ ఫైట్

జూనియర్ ఎన్టీఆర్ రాక కోసం ఎదురు చూస్తున్న అభిమానులు తెలుగుదేశం పార్టీకి చెందిన ఏ విధఘైన బ్యానర్లను గానీ ఫ్లెక్సీలను గానీ ప్రదర్శించడం లేదు. జూనియర్ ఎన్టీఆర్, స్వర్గీయ ఎన్టీ రామారావు పేర్లు రాసిన బ్యానర్లను మాత్రమే ప్రదర్శిస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన ఏ విధమైన ఆనవాళ్లు కూడా తన పర్యటనలో కనిపించకూడదని జూనియర్ ఎన్టీఆర్ సూచించినట్లు చెబుతున్నారు.
ప్రస్తుత స్థితిని బట్టి బాబాయ్ బాలకృష్ణను ఢీకొనడానికే జూనియర్ ఎన్టీఆర్ సిద్ధపడినట్లు చెబుతున్నారు. తన వద్దకు రావద్దని జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ నాయకులకు కూడా చెప్పినట్లు సమాచారం. దీంతో వల్లభనేని వంశీ కూడా జూనియర్ ఎన్టీఆర్ పర్యటనకు దూరంగా ఉంటారని అంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు మాత్రం విజయవాడలో హల్‌చల్ చేస్తున్నారు. సీనియర్ ఎన్టీఆర్ తర్వాత జూనియర్ ఎన్టీఆరేనని, మరెవరూ లేరని వారంటున్నారు.
ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనడానికి జూనియర్ ఎన్టీఆర్ శనివారం విజయవాడ వస్తున్నారు. ఈ సందర్భంగా బాబాయ్, అబ్బాయ్ మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. జూనియర్ ఎన్టీఆర్ పర్యటనకు దూరంగా ఉండాలని బాలకృష్ణ తెలుగుదేశం పార్టీ నాయకులకు ఫోన్ ద్వారా తెలియజేశారు. ఈ విషయం తెలిసిన జూనియర్ ఎన్టీఆర్ తన పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకుని, బలప్రదర్శనకు సిద్ధపడినట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications