ప్రతి పౌరుడికీ రక్షణ కావాలి, అదే లౌకికవాదం: మోడీ
న్యూఢిల్లీ: గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ లౌకికవాదం నిర్వచనాన్ని విస్తృతపరిచారు. దేశంలోని ప్రతి పౌరుడికీ రక్షణ అవసరమని, అదే లౌకికవాదమని ఆయన అన్నారు. ఇండియా టుడే ఏర్పాటు చేసిన నాయకత్వ సదస్సులో ఆయన శనివారం ప్రసంగించారు. పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. యుపిఎ 1, యుపిఎ 2 ప్రభుత్వాలు దేశం ఫెడరల్ వ్యవస్థను దెబ్బ తీశాయని ఆయన అన్నారు. గుజరాత్ ఏం సాధించిందో భారత్ సాధించగలదని ఆయన అన్నారు. గాంధీ వైపు చూస్తే అర్థమవుతుందని, ఊడ్చినా, వడికినా, బోధించినా అంతా దేశ స్వాతంత్ర్యం కోసమేనని ప్రజలకు నేర్పాడని ఆయన అన్నారు.
దేశం పేదరికానికి బానిస కావడాన్ని నివారించాల్సి ఉందని ఆయన అన్నారు. పాలనలో సంస్కరణలు అవసరని, సామాన్య మానవుడి తీరుకు అనుగుణంగా ఉండాలని ఆయన అన్నారు. మీకు విద్యుచ్ఛక్తి కాదు, నీళ్లు కావాలని తాను రైతులకు చెప్పానని, మీకు విద్యుత్తు ఇవ్వనని, నీళ్లు ఇస్తానని చెప్పాని, అలా చెప్పే తెగువ కావాలని ఆయన అన్నారు. గత 40 ఏళ్ల కాలంలో గుజరాత్‌లో 40 వేల హెక్టార్లు సాగులోకి వచ్చిందని, తన ప్రభుత్వ హయాంలో 2001 నుంచి 8 లక్షల హెక్టార్లకు చేరుకుందని ఆయన అన్నారు.

అధికార యాత్రంగం విధి రాజకీయ యజమానులకు సేవలు చేయడం కాదని, సామాన్యులకు సేవలందించాలని ఆయన అన్నారు. అదే విషయం తాను అధికారులకు చెప్పినట్లు ఆయన తెలిపారు. దేశానికి కావాల్సింది చట్టాలు కాదని, ఆచరణ అని ఆయన అన్నారు. ఆచరణ లేనప్పుడు చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు.
ప్రజా సమస్యల పరిష్కార విధానం బాగా లేదంటే ప్రజాస్వామ్యం బాగా లేదని అర్థమని, పౌరులను సాధికారులను చేయాలని, వారికి అధికారం ఇవ్వాలని ఆయన అన్నారు. ఓ పేదవాడు ఆన్‌లైన్‌లో భయపెడుతున్నాడంటే అది సాధికారిత అని ఆయన అన్నారు. ఆలోచనలను వ్యవస్థాగతం చేయాలని ఆయన అన్నారు.
విమానాశ్రయాలను ప్రైవేట్ క్యారేజీలు వాడుకోవడం లేదా, అన్ని రైల్వే ట్రాక్‌లపై ప్రభుత్వ క్యారేజీలే ఎందుకు ఉండాలని, కోచ్‌లు ప్రైవేట్‌వై ఉండి, ట్రాక్‌లు ప్రభుత్వానివై ఉండాలని ఆయన అన్నారు. పర్యావరణ అనుకూల అభివృద్ధికి తాను కట్టుబడి ఉన్నానని ఆయన అన్నారు.
ప్రధాని కావాలని అనుకుంటున్నారా అని అడిగితే తమ అధికార యంత్రాంగం మంచి పనుల నుంచి తన చింతన్ శిబిర్ పాఠాలు తీసుకుంటోందని, గుజరాత్ నమూనా పనికి వస్తుందనుకుంటే దాన్ని అనుకరించవచ్చునని, దానికి తానే అవసరం లేదని ఆయన సమాధానమిచ్చారు. విజ్ఝానం విషయంలో భారత్ మొదటి నుంచీ అగ్రభాగాన ఉందని ఆయన అన్నారు. పాకిస్తాన్‌తోనే కాదు, అన్ని పొరుగుదేశాలతోనూ సత్సంబంధాలుండాలని, అయితే దేశ ప్రయోజనాలకే ప్రథమ ప్రాధాన్యం ఉండాలని ఆయన అన్నారు.
ప్రపంచానికి ఆయుధాలను సరఫరా చేసే దేశంగా భారత్ కావాలని తాను కలలు కంటున్నట్లు ఆయన తెలిపారు.మన దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలు మరణించడానికే పుట్టాయని, వాటిని మూసేయడమో అమ్మడమో చేయడమే ఉందని తమ గుజరాత్ ప్రభుత్వం మూడో ప్రత్యామ్నాయాన్ని అందించిందని ఆయన అన్నారు. ప్రభుత్వం వ్యాపారం చేయకూడదని ఆయన అన్నారు. దేశ అభివృద్ధి అవసరాలకు అనుగుణంగా ప్రాధాన్యతలను ఎంచుకోవాలని, హోటళ్లను నిర్మించడానికి బదులు ఆస్పత్రులను నిర్మించాలని ఆయన అన్నారు.
-
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు












Click it and Unblock the Notifications