వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ కోసం 15 మంది.., చాయ్ బిస్కట్ లీడర్స్: కెటిఆర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

KT Rama Rao
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కోసం పదిహేను మంది తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు ఆయా పార్టీలను విప్ ధిక్కరిస్తే.. తెలంగాణ కోసం కనీసం పది మంది తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు కూడా ముందుకు రాలేకపోయారని తెలంగాణ రాష్ట్ర సమితి సిరిసిల్ల శాసనసభ్యుడు కల్వకుంట్ల తారక రామారావు ఆదివారం మండిపడ్డారు. మంత్రులకు పౌరుషం ఉంటే అవిశ్వాసంలో కలిసి వచ్చే వారన్నారు.

తెలంగాణ ప్రాంతానికి నిధులు ఇవ్వమని చెప్పే హక్కు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఎక్కడిదని ఆయన ప్రశ్నించారు. ఆ ధైర్యం ఎక్కడి నుండి వచ్చిందన్నారు. కిరణ్ నిధులు ఇవ్వమని చెప్పినప్పుడే తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు కాలర్ పట్టుకొని నిలదీయాల్సి ఉండెనన్నారు. కానీ వారు పెదవి విప్పక పోవడం బాధాకరం అన్నారు. తెలంగాణ నేతల అసమర్థత వల్లే ముఖ్యమంత్రి అహంకారంతో మాట్లాడుతున్నారని విమర్శించారు.

తెలంగాణ నేతలు అంటే చాయ్, బిస్కెట్‌లా తయారయ్యారన్నారు. రూలింగ్ అంటే రాజరికం అనుకుంటున్నారని ధ్వజమెత్తారు. కిరణ్ మంత్రివర్గంలో చేరే స్థాయికి బాబు చేరారన్నారు. డిప్యూటి సిఎం, నాలుగు మంత్రి పదవులు ఇస్తే బాబు మంత్రివర్గంలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి ఉప ఎన్నికలకు భయపడే విప్ ధిక్కరించిన వారిపై వేటు వేసేందుకు భయపడుతున్నారన్నారు. జూన్ తర్వాత వేటు అంటే భయపడటమే అన్నారు. దమ్ముంటే విప్ ధిక్కరించిన వారిపై వేటు వేయాలన్నారు.

తెలంగాణ ఇస్తాం

బిజెపి అధికారంలోకి రాగానే తెలంగాణ ఇస్తామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. తెలుగు మాట్లాడే వారికి రెండు రాష్ట్రాలు ఉండవద్దని రాజ్యాంగంలో ఎక్కడా చెప్పలేదన్నారు. పరిపాలన సౌలభ్యం కోసం రెండు రాష్ట్రాలు ఉంటే తప్పేమిటని ప్రశ్నించారు. ప్రపంచంలో ఎన్నో ఉద్యమాలు జరిగినా ఇంతమంది బలిదానాలు చేసుకోలేదన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష తెలంగాణ రాష్ట్రం అన్నారు.

రెండు ప్రాంతాలు అభివృద్ధి చెందాలని తాము భావిస్తున్నామన్నారు. బిజెపికి ప్రాంతాలపై విద్వేశం లేదన్నారు. కానీ, మా సిద్ధాంతం చిన్న రాష్ట్రాలు అన్నారు. తెలంగాణ అన్నంత మాత్రాన సీమాంధ్రకు వ్యతిరేకం కాదన్నారు. నగదు బదలీ పథకం పేదలకు వ్యతిరేకమన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం రాజకీయ అనిశ్చితి నెలకొందన్నారు. ప్రభుత్వం యంత్రాంగంపై పట్టు కోల్పోయిందన్నారు. ఉగ్రవాదంపై మాట్లాడే హక్కు కాంగ్రెసుకు లేదన్నారు.

English summary
Telangana Rastra Samithi MLA KT Rama Rao has blamed 
 
 Telangana Minister and MLAs for not vote against 
 
 Kiran Kumar Reddy's government in No Confidence 
 
 Motion.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X