కిరణ్ రెడ్డి సభా వేదిక వద్ద అనుమానితుడి కలకలం

Kiran Kumar Reddy
విశాఖపట్నం: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సభా వేదిక వద్ద తచ్చాడుతున్న అనుమానిత వ్యక్తిని పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. విశాఖ ఏజెన్సీలోని మావోయిస్టు ప్రాబల్య ప్రాంతమైన గూడెం కొత్త వీధిలో ఆదివారం ముఖ్యమంత్రి పర్యటన ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రెండు రోజులుగా నాలుగు కంపెనీల పోలీసు బలగాలు గాలింపు, వాహన తనిఖీలు నిర్వహించారు.

అయితే, ఆదివారం ముఖ్యమంత్రి వచ్చే సమయానికి ముందు ఓ అనుమానిత వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనుమానితుడు మావోయిస్టు మిలీషియా సభ్యుడిగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో కిరణ్ కుమార్ రెడ్డి సభ వద్ద మరింత పోలీసు బందోబస్తును పెంచారు.

ముందుగానే భారీగా గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ శనివారం చింతపల్లి, జికె వీధి మండలాల్లో మావోయిస్టు యాక్షన్ టీమ్ సభ్యులు సంచరిస్తున్నారనే ప్రచారం జరిగింది. ఆ ప్రచారం జరగడంతో అప్పటికే బలగాలను రెట్టింపు చేశారు. కేవలం జికె వీధి మండల కేంద్రంలోనే మూడువేల మంది పోలీసులను నియమించారు. చింతపల్లి, రింతాడ, ఏబులం, సప్పర్ల, సీలేరు, ధారకొండ ప్రాంతాల్లో ఐదు ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటుచేసి క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.

ముఖ్యమంత్రి భద్రతా ఏర్పాట్లను జిల్లా ఎస్పీ శ్రీనివాస్, ఓఎస్‌డి దామోదర్ రెండు రోజులుగా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. డిఐజి స్వాతి లక్రా శనివారం బందోబస్తును పరిశీలించి సిబ్బందికి ప్రత్యేక సూచనలు చేశారు. ముఖ్యమంత్రి పర్యటనకు ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డు లేనిదే ఏ ఒక్కరినీ అనుమతించకూడదని డిఐజి పోలీసులకు సూచించారు. విఐపిలు, మంత్రులు, మీడియా ప్రతినిధులు, ప్రజలు సభా ప్రాంగణానికి వెళ్లేందుకు ప్రత్యేక మార్గాలు ఏర్పాటుచేయాలని డిఐజి ఆదేశించారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో జికె వీధి మండల కేంద్రాన్ని పోలీసులు పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు.

విశాఖ చేరుకున్న సిఎం

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మధ్యాహ్నం విశాఖపట్నం చేరుకున్నారు. ఆయన విశాఖలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+