• search
తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

శ్రీవారి ఆశీస్సుల కోసం సుశీల్ కుమార్ షిండే...(పిక్చర్స్)

By Srinivas
|

చిత్తూరు/ఏలూరు: కేంద్రం హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం విఐపి విరామ సమయంలో షిండే స్వామి వారి సేవలో పాల్గొన్నారు. మహాద్వారం వద్ద షిండేకు టిటిడి అధ్యక్షుడు కనుమూరి బాపిరాజు, ఈవో ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.

అనంతరం రంగ నాయకుల మండపంలో అర్చకుల వేదాశీర్వచనం పలికి శేషవస్త్రంతో సత్కరించారు. అనంతరం తీర్ఫప్రసాదాలు అందించారు. శనివారం తిరుమలకు వచ్చిన షిండే శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఆదివారం శ్రీవారిని దర్శించుకున్న అనంతరం షిండే పశ్చిమ గోదావరి జిల్లాలోని మోడీ గ్రామానికి వెళ్లారు. అక్కడ హైలెవల్ బ్రిడ్జికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా షిండే మాట్లాడారు.

జాతీయ విపత్తుల నివారణకు కేంద్ర ప్రభుత్వం మూడు దశలుగా ప్రపంచ బ్యాంకు సహాయంతో తీర ప్రాంత రాష్ట్రాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తోందని చెప్పారు. మొదటి దశలో రూ.15వందల కోట్లతో ఆంధ్ర, ఒడిశా తీర ప్రాంతాల్లో రహదారులు, వంతెనల నిర్మాణం, ప్రజలను అప్రమత్తం చేసేందుకు శిక్షణ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు చెప్పారు. రెండో దశలోని ఎపికి అధిక ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు.

మోడిలోని బ్రిడ్జిని ఏడాదిలోపు పూర్తి చేస్తామని ఆయన చెప్పారు. స్థానిక సమస్య అవగాహన ఉందని, వాటి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు. భీమవరం-దొంగపిండి మధ్య రూ.10 కోట్లతో మరో బ్రిడ్జి నిర్మిస్తామని చెప్పారు. ప్రభుత్వ శాఖలు కలిసి కట్టుగా విపత్తులను ఎదుర్కోవాలని సూచించారు.

శ్రీవారి ఆశీస్సుల కోసం షిండే...(పిక్చర్స్)

షిండేకు శేసవస్త్రంతో సత్కారం

శ్రీవారి ఆశీస్సుల కోసం షిండే...(పిక్చర్స్)

శ్రీవారి పటాన్ని షిండేకు ఇస్తున్న ఈవో, అధ్యక్షుడు

శ్రీవారి ఆశీస్సుల కోసం షిండే...(పిక్చర్స్)

పుణ్యజలం తలపై...

శ్రీవారి ఆశీస్సుల కోసం షిండే...(పిక్చర్స్)

షిండేతో కనుమూరి తదితరులు

శ్రీవారి ఆశీస్సుల కోసం షిండే...(పిక్చర్స్)

షిండేకు పూజారి ఆశీర్వాదం

శ్రీవారి ఆశీస్సుల కోసం షిండే...(పిక్చర్స్)

ప్రసాదం స్వీకరిస్తున్న కేంద్ర హోంమంత్రి

శ్రీవారి ఆశీస్సుల కోసం షిండే...(పిక్చర్స్)

ఆలయ ప్రాంగణంలో

శ్రీవారి ఆశీస్సుల కోసం షిండే...(పిక్చర్స్)

ధ్వజ స్తంభానికి మొక్కుతున్న కేంద్రమంత్రి

శ్రీవారి ఆశీస్సుల కోసం షిండే...(పిక్చర్స్)

షిండే సాష్టాంగ నమస్కారం

శ్రీవారి ఆశీస్సుల కోసం షిండే...(పిక్చర్స్)

హారతి తీసుకుంటున్న షిండే

శ్రీవారి ఆశీస్సుల కోసం షిండే...(పిక్చర్స్)

శ్రీవారి సేవలో..

శ్రీవారి ఆశీస్సుల కోసం షిండే...(పిక్చర్స్)

అమ్మవారి సేవలో..

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

తిరుపతి యుద్ధ క్షేత్రం
జనాభా గణాంకాలు
జనాభా
21,54,860
జనాభా
 • గ్రామీణ ప్రాంతం
  67.07%
  గ్రామీణ ప్రాంతం
 • పట్టణ ప్రాంతం
  32.93%
  పట్టణ ప్రాంతం
 • ఎస్సీ
  25.09%
  ఎస్సీ
 • ఎస్టీ
  9.45%
  ఎస్టీ

English summary
Hon’ble Union Minister for Home Affairs Sri Sushil Kumar Shinde offered Prayers to Lord Venkateswara at Tirumala on wee hours of Sunday morning during Suprabatham Seva. On his arrival in front of Sri Vari Temple TTD Chairman Sri K.Bapi Raju, EO Sri L.V.Subramanyam and officials have welcomed the Union Home Minister.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more