స్విస్ మహిళపై గ్యాంగ్ రేప్: స్పందించిన స్విట్జర్లాండ్

Swiss woman issue, embassy calls for swift probe
భోపాల్: మధ్యప్రదేశ్‌లో దారుణం జరిగింది. దతియా జిల్లా అటవీ ప్రాంతంలో స్విట్జర్లాండుకు చెందిన ఓ పర్యాటకురాలిపై సామూహిక అత్యాచారం జరిగింది. స్విస్‌కు చెందిన దంపతులు మధ్య ప్రదేశ్‌లో ఆలయాలు ఎక్కువగా ఉండే ఓర్చా నుంచి ఉత్తర ప్రదేశ్‌లోని ఆగ్రాకు సైకిళ్లపై యాత్ర మొదలుపెట్టారు.

వారి యాత్ర మధ్యప్రదేశ్‌లోని దతియా జిల్లా ఝడియా గ్రామానికి చేరుకున్నప్పుడు ఆ గ్రామానికి చెందిన ఏడుగురు వ్యక్తులు అక్కడి అటవీ ప్రాంతంలో ఆ దంపతులను దోచుకున్నారు. అనంతరం మహిళపై సామూహిక అత్యాచారం చేసి పారిపోయారు. మహిళను గ్వాలియర్ ఆస్పత్రికి తరలించిన పోలీసులు, ఆమె ఫిర్యాదు ఆధారంగా ఇరవై మందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

బాధితురాలి వయస్సు ముప్పై మూడు. మరోవైపు తాజా ఘటనను తీవ్రంగా పరిగణించాలని జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ చెప్పారు. బాధ్యులను కఠినంగా శిక్షించాలని ఆమె మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరారు. తమ దేశానికి చెందిన మహిళ సామూహిక అత్యాచారానికి గురవడంపై స్విట్జర్లాండు ఆందోళన వ్యక్తం చేసింది.

కేసును వేగవంతంగా దర్యాఫ్తు చేసి బాధితురాలికి న్యాయం చేయాలని భారత్‌ను కోరింది. ఈ మేరకు స్విస్ రాయబార కార్యాలయం ఓ ప్రకటనను విడుదల చేసింది. బాధితురాలికి తగిన చికిత్స అందించడంపై దృష్టి సారించినట్లు తెలిపింది. కేసుకు సంబంధించి ఢిల్లీలోని స్విస్ రాయబార కార్యాలయ అధికారులు ఇప్పటికే మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని సంప్రదించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+