వ్యవసాయ బడ్జెట్ ముఖ్యాంశాలు: బహిష్కరించిన టిడిపి

వ్యవసాయ బడ్జెట్ ప్రవేశ పెడుతున్నందుకు తాను సంతోషంగా ఉన్నానని కన్నా ఈ సందర్భంగా చెప్పారు. కన్నా ప్రసంగాన్ని ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నప్పటికీ ఆయన తన ప్రసంగాన్ని చదువుకుంటూ వెళ్లారు. అన్నం పెట్టే రైతులకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని చెప్పారు. వ్యవసాయ ఉప ప్రణాళిక చరిత్రలో నిలిచిపోతుందన్నారు.
వ్యవసాయ బడ్జెట్ ముఖ్యాంఖాలు
- రూ.25, 962తో వ్యవసాయ బడ్జెట్
- ప్రణాళికేతర వ్యయం - రూ.17,694 కోట్లు
- ప్రణాళికా వ్యయం - రూ.8267 కోట్లు
- ఈ ఏడాది వ్యవసాయ రుణాల లక్ష్యం రూ.72,450 కోట్లు
- వ్యవసాయ బడ్జెట్‌లో ప్రకృతి వైపరీత్యాలకు రూ.589 కోట్లు
- కనీస మద్దతు ధర లభించని పక్షంలో రైతులకు ఆలంబన నిధి రూ.100 కోట్లు
- వ్యవసాయ విద్యుత్ రాయితీ కోసం రూ.3,621 కోట్లు
- వర్షాధార వ్యవసాయ అభివృద్ధికి రూ.2,903 కోట్లు
- సోలార్ పంపు సెట్లకు రూ.150 కోట్లు
- వడ్డీ లేని పంట రుణాలకు రూ.500 కోట్లు
- వ్యవసాయ కనెక్షన్‌లకు నాణ్యమైన విద్యుత్ కోసం రూ.1154 కోట్లు
- వ్యవసాయ యాంత్రీకరణకు రూ.450 కోట్లు
- 82వేల టన్నుల ఆహార ధాన్యాల నిల్వకు రూ.42 కోట్లతో గోదాంల నిర్మాణం
- భూసార అభివృద్ధి, నిర్వహణకు రూ.2,309 కోట్లు
- జైకా సహకారంతో 16 జిల్లాల్లో 2.43 లక్షల వ్యవసాయ కనెక్షన్లు
- విత్తనాభివృద్ధికి రూ.308 కోట్లు
- రూ.లక్ష లోపు అయితే రైతులకు వడ్డీ లేని రుణాలు
- పంటల భీమాకు రూ.410 కోట్లు












Click it and Unblock the Notifications