కెసిఆర్ ఫోన్: టిఆర్ఎస్‌లోకే అన్న టిడిపి మాజీ మంత్రి

చంద్రశేఖర్ తన రాజీనామా లేఖను పార్టీ కార్యాలయానికి పంపించారు. ఈ సందర్భంగానే ఆయన మాట్లాడారు. తెరాసలో చేరుతానని ప్రకటించారు. తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి తలపెట్టిన సడక్ బంద్ కార్యాక్రమంలో తాను పాల్గొంటానని చెప్పారు.
తెలంగాణ ప్రజల బాధలు చంద్రబాబుకు పట్టక పోవడం తనను కలచి వేసిందన్నారు. మరోవైపు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు టిడిపికి రాజీనామా చేసిన పి.చంద్రశేఖర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. పార్టీలోకి ఆహ్వానించినట్లుగా సమాచారం. ఫోన్‌లో మాట్లాడిన అనంతరం తెరాసలో చేరేందుకు పి.చంద్రశేఖర్ నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.
కాగా, పి.చంద్రశేఖర్ తనకు శాసనమండలి సీటును కేటాయించక పోవడం వల్ల అలక చెంది పార్టీని వీడేందుకు సిద్ధమైనట్లుగా నిన్న వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. నిన్న మాట్లాడిన ఆయన.. తాను పార్టీని వీడేందుకు ప్రత్యేక కారణాలు ఏమీ లేవంటున్నారు. తాను పార్టీ అధినేతను ఒకటి రెండు రోజుల్లో కలిసి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తానన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితితో కలిసి పని చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా చెప్పారు. అయితే, ఈ రోజు మాత్రం తెరాసలో చేరుతున్నట్లు ప్రకటించారు.












Click it and Unblock the Notifications