శ్రీలక్ష్మి ఆరోగ్య పరిస్థితి ఏమిటి?: సిబిఐ కోర్టు ఆదేశం

దీనిపై కోర్టు విచారిస్తోంది. శ్రీలక్ష్మి ఆరోగ్య పరిస్థితిపై నిర్ధారించాలని చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌కు సోమవారం సిబిఐ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఉస్మానియా, మహాత్మా గాంధీ ఆసుపత్రుల వైద్యులతో ఆమె ఆరోగ్య పరిస్థితిపై నిర్ధారించి తెలుపాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
శ్రీలక్ష్మి ఆపరేషన్ కోసం గతేడాది చివర్లో మధ్యంతర బెయిల్ పైన బయటకు వచ్చారు. ఆమె మధ్యంతర బెయిల్ గడువు ముగియడంతో బెయిల్ గడువును పొడిగించాలని ఆమె కోర్టులో దరఖాస్తు చేసుకున్నారు. దీనిపై కోర్టు విచారణ జరిపింది. అనంతరం ఆమె ఆరోగ్య పరిస్థితిపై నిర్ధారించాలని ఆదేశించింది. అదే సమయంలో ఆమెను కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది.
కాగా, ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసులో శ్రీలక్ష్మిని ప్రాసిక్యూషన్ చేసేందుకు కేంద్రం పదిహేను రోజుల క్రితం అనుమతించిన విషయం తెలిసిందే. కేంద్ర మంత్రివర్గం ఈ నిర్ణయం తీసుకుంది. అవినీతి నిరోధక చట్టం అభియోగాల పైన శ్రీలక్ష్మిని విచారించేందుకు అనుమతిని ఇచ్చింది.
ఐపిసి, పిసి యాక్టుల కింద విచారించేందుకు అనుమతి లభించింది. ఓఎంసికి గనుల లీజు కట్టబెట్టడంలో శ్రీలక్ష్మి అక్రమాలకు పాల్పడ్డారనే అభియోగాలు ఆమెపై నమోదయ్యాయి. శ్రీలక్ష్మిపై ఐపిసి అభియోగాలను సిబిఐ కోర్టు ఇప్పటికే విచారణకు స్వీకరించింది. తన బెయిల్ పిటిషన్‌ను పొడిగించాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సమయంలో కేంద్రం ఆమెను విచారణకు అనుమతించింది.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications