వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కిరణ్ రెడ్డి సీల్డ్ కవర్ సిఎం, ఆ దమ్ముందా?: షర్మిల

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sharmila
గుంటూరు: కిరణ్ కుమార్ రెడ్డి సీల్డ్ కవర్ ముఖ్యమంత్రి అని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల తన వస్తున్నా మీకోసం పాదయాత్రలో ఆరోపించారు. ఆమె పాదయాత్ర గుంటూరు జిల్లాలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆదివారం ఆమె పలు ప్రాంతాల్లో మాట్లాడారు. రాష్ట్రాన్ని అసమర్థ ప్రభుత్వం పాలిస్తోందన్నారు. ఇటువంటి ప్రభుత్వానికి ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ మద్దతు పలకడం దారుణం అన్నారు.

వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణంతో రాష్ట్రం అస్తవ్యస్త మైందని అన్నారు. రాష్ట్రంలో ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నారన్నారని, వీరి సమస్యలు తీరాలంటే వైయస్ జగన్ ముఖ్యమంత్రి కావాలన్నారు. వైయస్ హయాంలో రైతులు ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగు కొనసాగించారన్నారు. నేడు కాంగ్రెస్ హయాంలో వ్యవసాయానికి 3 గంటలు విద్యుత్ సరఫరా కూడా కాని పరిస్థితి నెలకుందన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కొనసాగడానికి వీలులేదని చంద్రబాబు ప్రకటిస్తూనే మరో పక్క అవిశ్వాసానికి మద్దతు ఇవ్వకుండా ప్రభుత్వాన్ని కాపాడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వానికి దమ్ముంటే ఎన్నికలు జరపాలని డిమాండ్ చేశారు. కాంగ్రెసు ప్రభుత్వం నిత్యావసర వస్తువుల ధరలు పెంచడంతో పాటు రూ.32 వేల కోట్ల విద్యుత్ ఛార్జీల భారాన్ని ప్రజల నెత్తిన వేసిందని ఆరోపించారు.

వైయస్ చనిపోయిన మూడేళ్లలో గ్యాస్, కరెంట్ ధరలను ప్రభుత్వం మూడు రెట్లు పెంచిందని ఆరోపించారు. ఇటువంటి ప్రభుత్వాన్ని సాగనంపడానికి ప్రతిపక్షాలు అన్ని ఒకటై అవిశ్వాస తీర్మానం పెడితే తెలుగుదేశం పార్టీ కలిసి రాకపోవడం దారుణం అని ఆమె మండిపడ్డారు.

English summary
YSR Congress Party chief YS Jaganmohan Reddy's sister Sharmila has alleged that Kiran Kumar Reddy was sealed cover chief minister.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X