ఖమ్మం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ ఎవడు, ఎక్కడి నుంచి వచ్చాడు: రేణుకా చౌదరి

By Pratap
|
Google Oneindia TeluguNews

Renuka Choudhary
ఖమ్మం: కాంగ్రెస్‌ను ఢీకొనే పార్టీలకు, నేతలకు పుట్టగతులుండవని మాజీ కేంద్రమంత్రి రేణుకా చౌదరి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఖమ్మంలోని ఎంబీ ఫంక్షన్ హాల్‌లో ఆదివారం జరిగిన నగర కాంగ్రెస్ విస్తృత సమావేశంలో రేణుకా చౌదరి ఆదివారం మాట్లాడారు. వైయస్సార్ కాంగ్రెస్‌పై తనదైన దూకుడుతో విరుచుకుపడ్డారు. జ

గన్ ఎవడు వాడు? ఎక్కడి నుంచి వచ్చాడు ? అంటూ ప్రశ్నిచారు. జైలు పాలైన వాడి పార్టీని నమ్ముకునే వారికి కష్టాలు తప్పవని హెచ్చరించారు. పార్టీకి ద్రోహం చేయాలని చూసే వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి మరే పార్టీ సాటి రాబోదని ఆమె అన్నారు. బాధ్యత గల నేతలు కూడా కొందరు ఇతర పార్టీల జెండాలు కట్టిన మోటార్ సైకిళ్ళు ఎక్కి ప్రయాణించటం శోచనీయమన్నారు.

పార్టీ కోసం కష్టించి పనిచేసే వారిని అందలం ఎక్కించే సంస్కృతి కాంగ్రెస్‌దన్నారు. స్వలాభం కోసం హడావుడి చేసే వారు ఎప్పటికీ నేతలుగా రాణించలేరన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యున్నతి కోసం ఎన్నో తాగ్యాలు చేసిన కార్యకర్తలున్నారని, పార్టీ జెండాను భుజాన వేసుకొని పనిచేసే వారికి గుర్తింపు తప్పకుండా ఉంటుందని రేణుకా చౌదరి చెప్పారు. అత్యవసర సమావేశాలు నిర్వహించినంత మాత్రాన సరిపోదని, సమావేశ నిర్ణయాలను అమలు చేయగలిగినప్పుడే పార్టీకి ప్రయోజనం ఉంటుందని అన్నారు.

రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో విజయసాధనకు కార్యకర్తలంతా సమష్టిగా కృషి చేయాలని చెప్పారు. నా రాజకీయ జీవితం కూడా కార్పొరేటర్‌గానే మొదలైంది. జంట నగరాల్లోని కార్పొరేట్ ఎన్నికల్లో తానే అందరికన్నా ఎక్కువ మెజార్టీతో గెలిచానని, ప్రజలకు, పార్టీకి విశ్వాసంగా ఉండటం వల్లే గెలుపు సాధ్యపడిందని గుర్తు చేశారు.

ప్రజలను ఓటు అడిగే హక్కు కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందని రాష్ట్ర ఉద్యాన శాఖ మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. గత తొమ్మిదేళ్లుగా ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత కాంగ్రెస్‌దే అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తించని ఇల్లు లేదంటే అతిశయోక్తి కాదన్నారు. పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మునిసిపల్ ఎన్నికలు వరుసగా రానున్న నేపథ్యంలో పార్టీ శ్రేణులను సిద్ధపరచాలని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు వనమా వెంకటేశ్వరరావుకు సూచించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తదితర ప్రజా ప్రతినిధులు రోజుకు నాలుగు మండలాల్లో తిరిగి పార్టీ సమావేశాలు నిర్వహించాలన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకుపోయేందుకు కార్యకర్తలు కృషి చేయాలని శాసనసభ డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టి విక్రమార్క అన్నారు. గత తొమ్మిదేళ్లుగా అనేక సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు ఎంతో సేవ చేస్తున్నామని చెప్పారు. ఇందిరమ్మ పింఛన్లు, రాజీవ్ ఆరోగ్య శ్రీ, రేషన్ కార్డులు, ఉచిత విద్యుత్ వంటి పధకాలతో ప్రజలకు ఎంతో లబ్ది కలిగిందన్నారు.

English summary

 AICC spokesperson Renuka Choudhary has made wild comments against YSR Congress party president YS Jagan. She asked, who Jagan and from where he has come?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X