ఆ ఆలోచన నాదే: చంద్రబాబు, జగన్‌తో సాధ్యం: షర్మిల

కాంగ్రెస్ ప్రభుత్వానికి చివరి బడ్జెట్ అని జోస్యం చెప్పారు. కానూరులో విలేకరులను కలిసినప్పుడు సాధారణ, వ్యవసాయ బడ్జెట్‌లపై తీవ్రంగా స్పందించారు. "ఇదొక తప్పుల తడక, మొక్కుబడి బడ్జెట్. కొత్త విషయమేదీ లేదు. తప్పులు సరిదిద్దుకోవడంగానీ, సంక్షోభం నుంచి బయటపడేందుకుగానీ ప్రయత్నం జరగలేదు. ప్రభుత్వ అసమర్థతకు ప్రత్యక్ష నిదర్శనం'' అని ధ్వజమెత్తారు. కేటాయింపులు లెక్కల్లో చూపారు తప్ప చిత్తశుద్ధిగానీ, తగిన కసరత్తుగానీ కన్పించడం లేద న్నారు.
రాష్ట్రంలో అప్పులు లక్షా 79 వేల కోట్ల రూపా యలకు చేరాయని, తమ హయాంలో ఈ మొత్తం రూ.55వేల కోట్లు మాత్రమేనని గుర్తు చేశారు. ఇదేనా కాంగ్రెస్ సమర్థత? అని ఎద్దేవా చేశారు. "ఏడు గంటలు కరెంటు ఇస్తామని కట్టుకథలు ఇప్పుడూ చెప్పారు. అయితే మూడేళ్లలో కరెంటు సరిగ్గా లేక 30 వేల పరిశ్రమలు మూతపడ్డాయి. పారిశ్రామిక ఉత్పత్తి దెబ్బతింది. ఇది నిజం కాదా?'' అని ప్రశ్నించారు. జలయజ్ఞంలో కోట్లు ఖర్చుపెడుతున్నట్లు లెక్కలు చెబుతున్నారని, అదే నిజమైతే ఆయకట్టు పెరగాలిగానీ ఎందుకు క్షీణి స్తోందని ప్రశ్నించారు.
జగన్‌తోనే అభివృద్ధి
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల గుంటూరు జిల్లాలో అన్నారు. ఆమె పాదయాత్ర జిల్లాలో కొనసాగుతోంది. టిడిపి అధికారంలో ఉన్నప్పుడు కరవుతో రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారని విమర్శించారు. ప్రస్తుత ముఖ్యమంత్రి సైతం బాబు బాటలోనే పయనిస్తున్నారని విమర్శించారు.












Click it and Unblock the Notifications