ఎవర్నీ వదలట్లేదు: అత్యాచార నిరోధక బిల్లుపై జయప్రద

కామాంధులు మైనర్ బాలికలను కూడా వదలటం లేదని ఆమె మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, తమిళనాడు, బీహార్ తదితర రాష్ట్రాల్లో అత్యాచారాల దురాఘతాలు కొనసాగుతున్నాయని ఆమె లోకసభలో అన్నారు. అత్యాచార నిందితుల పైన కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.
కాగా, అంతకుముందు అత్యాచార నేరాలకు సంబంధించి కఠిన తరమైన శిక్షల అమలుకు రూపొందించిన అత్యాచార నిరోధక బిల్లును కేంద్రం ఈ రోజు లోకసభలో ప్రవేశపెట్టింది. కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే దీనిని సభలో ప్రవేశ పెట్టారు. ఈ బిల్లును ఆమోదించడానికి ప్రధాన ప్రతిపక్షం భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉందని ఆ పార్టీ ఉపాధ్యక్షుడు గోపీనాథ్ ముండే తెలిపారు.
లోకసభలో మధ్యాహ్నం అత్యాచార నిరోధక బిల్లు ప్రవేశ పెట్టిన తర్వాత చర్చ ప్రారంభమైంది. ప్రతిపక్ష సభ్యులు పలు సవరణలను ప్రతిపాదించారు. పరస్పర అంగీకారంతో శృంగారంలో పాల్గొనడానికి ఉండాల్సిన వయోపరిమితిని పదహారేళ్లకు తొలుత తగ్గించిన ప్రభుత్వం తర్వాత దిగి వచ్చింది.
దీనికి బదులు 18 ఏళ్లుగానే వయో పరిమితిని ఉంచేందుకు అంగీకరించింది. అత్యాచార బాధితురాలు చనిపోయినా లేదా జీవచ్ఛవంగా మారినా దోషికి కనీస శిక్షగా ఇరవై ఏళ్లు జైలు, గరిష్టంగా చనిపోయే వరకు జైలు శిక్ష విధించాలని చట్టంలో ఉన్న నిబంధనలను యథాతథంగా ఉంచింది. మరోవైపు, కేంద్రమంత్రి వర్గం ఆహార భద్రత బిల్లుకు ఆమోదం తెలిపింది.












Click it and Unblock the Notifications