వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యువతితో మాజీ ఎంపీ అసభ్య ప్రవర్తన: అరెస్ట్, రిలీజ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Former SP MP detained for misbehaving with woman on train
లక్నో: మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన ఆరోపణలతో సమాజ్‌వాది పార్టీ నేత, మాజీ పార్లమెంటు సభ్యుడు చంద్రనాథ్ సింగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని ఆ తర్వాత గంటలో విడుదల చేశారు. ఈ ఘటన సోమవారం జరిగింది. అరవై రెండేళ్ల సిఎన్ సింగ్ పద్మావతి ఎక్సుప్రెస్‌లో వెళ్తుండగా తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఓ యువతి ఫిర్యాదు చేసింది. తనతో అసభ్యంగా ప్రవర్తించిన సమయంలో సదరు నేత మద్యం మత్తులో ఉన్నారని చెప్పింది.

రైల్వే పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది. తనతో అసభ్యంగా ప్రవర్తించారని యువతి చెప్పిన వాదనకు ప్రయాణీకులు కూడా మద్దతు పలికారు. యువతి ఫిర్యాదుతో రైల్వే పోలీసులు అతనిని అరెస్టు చేశారు. అయితే, ఫిర్యాదు చేసిన యువతి గంట వ్యవధిలోనే తన ఫిర్యాదును వెనక్కి తీసుకుంది. దీంతో పోలీసులు అతనిని విడిచి పెట్టారు.

బోగిలో సీట్ల విషయంలోను సిఎన్ సింగ్‌తో ఇతర ప్రయాణీకులకు వివాదం జరిగినట్లుగా సమాచారం. ఆయన టిక్కెట్ ఖరారు కాకున్నా బోగీ ఎక్కాడనే ఆరోపణలు వచ్చాయి. పోలీసులు తనను అరెస్టు చేసిన అనంతరం.. తనకు ఛాతి నొప్పి వస్తుందని చెప్పడంతో మాజీ ఎంపిని జిల్లా ఆసుపత్రికి తరలించారు.

మరోవైపు యువతి ఫిర్యాదు ఉపసంహరించుకోవడంతో పోలీసులు అతనిని విడిచి పెట్టారు. ఫిర్యాదు చేసిన యువతి మహిళా జిల్లా మెజిస్ట్రేట్‌కు ఫ్యాక్స్ పంపారని పోలీసులు చెప్పారు. ఆరోపణలు నిజమని తేలితే సిఎన్ సింగ్ పైన చర్యలు తీసుకుంటామని సమాజ్‌వాది పార్టీ చెప్పింది. వచ్చే లోకసభ ఎన్నికల్లో ఎస్పీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల జాబితాలో ఇతని పేరు కూడా ఉంది.

English summary

 Even as the Akhilesh Yadav government continues to battle the opposition onslaught over the deteriorating law and order scenario in Uttar Pradesh both inside and outside the UP assembly, a former Samajwadi Party MP CN Singh (62) was detained by the Government Railway Police Shahjahanpur for misbehaving with a female passenger in an inebriated state late on Sunday night, but was let off shortly following a compromise with the victim's family.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X