వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అసెంబ్లీ ప్రాంగణంలో పోలీస్‌ను చితకబాదిన ఎమ్మెల్యేలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Maharashtra MLAs on rampage, beat up cop
ముంబై: అసెంబ్లీ ప్రాంగణంలో ఓ పోలీసు అధికారిని ఎమ్మెల్యేలు చితకబాదిన సంఘటన మహారాష్ట్రలో మంగళవారం చోటు చేసుకుంది. అసిస్టెంట్ పోలీసు ఇన్స్‌పెక్టర్ సచిన్ సూర్వవంశిని ఎమ్మెల్యేలు చితకబాదారు. వసాయి నియోజకవర్గ ఎమ్మెల్యే క్షితిజ్ ఠాకూర్ వాహనాన్ని బాంద్రా-వోర్లి ప్రాంతంలో నిన్న(సోమవారం) సుర్యవంశి అనే ఈ పోలీసు అధికారి ఆపారు. ఎమ్మెల్యే పట్ల పోలీసు అధికారి మిస్ బిహేవ్ చేశారని ఆరోపిస్తూ ఎమ్మెల్యేలు ఆయనపై ఈ రోజు దాడికి పాల్పడ్డారు.

ఈ రోజు అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయం అనంతరం ఎమ్మెల్యే ఠాకూర్ సదరు పోలీసు అధికారి పైన ప్రివిలేజ్ నోటీసు ఇచ్చారు. తన వాహనాన్ని బాంద్రా-వోర్లీ ప్రాంతంలో అధికారి నిలిపివేసి బిస్ బిహేవ్ చేశారని ఎమ్మెల్యే ఆరోపిస్తూ ప్రివిలేజ్ నోటీసు ఇచ్చారు. ఎమ్మెల్యే చెప్పిన ప్రకారం... ఈ ఘటన సోమవారం చోటు చేసుకుంది. అతను అసెంబ్లీకి వెళ్తుండగా పోలీసు అధికారి వాహనాన్ని ఆపి మిస్ బిహేవ్ చేశాడు.

తన పట్ల మిస్ బిహేవ్ చేసిన పోలీసు అధికారిని వెంటనే సస్పెండ్ చేయాలని ఠాకూర్ డిమాండ్ చేశారు. అదే సమయంలో అధికారి సూర్యవంశి విజిటర్స్ గాలరీలో కూర్చున్నారు. అతనిని ఎమ్మెల్యే గుర్తించారు. దీంతో ఆయనకు తోడు పలువురు ఎమ్మెల్యేలు సూర్యవంశి వద్దకు దూసుకు వెళ్లి అతనిని కొట్టారు.

వెంటనే తేరుకున్న విధాన సభ సెక్యూరిటీ సిబ్బంది సూర్యవంశిని బయటకు తీసుకు వెళ్లారు. ఓ గదిలోకి తీసుకు వెళ్లి డాక్టర్లతో చెక్ చేయించారు. హోంమంత్రి ఆర్ఆర్ పాటిల్, ప్రధాన ప్రతిపక్ష నేత ఏక్‌నాథ్‌తో పాటు పలువురు ఎమ్మెల్యేలు పోలీసు అధికారిని పరామర్శించారు. ఈ ఘటనపై విచారణ జరిపిస్తామని స్పీకర్ చెప్పారు.

English summary
Behaving like anti-social elements, a group of MLAs today beat up a policeman inside Maharashtra Legislature building.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X