'డబ్బింగ్'పై వాయిదా తీర్మానం: అసెంబ్లీ వాయిదా

వాటిని సభాపతి తిరస్కరించారు. దీంతో విపక్షాలు సభాపతి పోడియాన్ని చుట్టుముట్టాయి. సభ్యులు ఎంతకూ శాంతించక పోవడంతో నాదెండ్ల సభను గంట పాటు పది గంటల వరకు వాయిదా వేశారు. అంతకుముందు తెలుగుదేశం పార్టీ వస్త్రాల పైన వ్యాట్ ఎత్తివేయాలని నిరసిస్తూ అసెంబ్లీ ముందున్న గన్ పార్కులో ధర్నా చేపట్టింది.
వ్యాట్ ఎత్తివేసే వరకు వస్త్ర వ్యాపారులకు అండగా ఉంటామన్నారు. పన్నులు పెంచమని చెబుతూనే ప్రభుత్వం ప్రజలను మోసగిస్తోందన్నారు. ప్రభుత్వం వ్యాట్‌ను తక్షణమే ఎత్తివేయాలని లేదంటే టిడిపి మరింత ఉద్యమిస్తుందని ఆ పార్టీ నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు.
తెలంగాణపై చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ కాంగ్రెసు ఎంపీలు వెంటనే రాజీనామా చేయాలని తెరాస సిద్దిపేట శాసనసభ్యుడు హరీష్ రావు డిమాండ్ చేశారు. పక్క దేశంలో తమిళుల ప్రయోజనాల కోసం డిఎంకే స్పందిస్తోంటే ఓట్లు వేసిన తెలంగాణ ప్రజల ప్రయోజనాలను తెలంగాణ కాంగ్రెసు ప్రజాప్రతినిధులు మర్చిపోయారని మండిపడ్డారు.
డిఎంకే ఉపసంహరణ నేపథ్యంలో తెలంగాణ ఎంపీలు తక్షణమే స్పందించాలని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఇది అనువైన సమయమన్నారు. ఇప్పుడు రాజీనామాస్త్రం ఉపయోగిస్తే తెలంగాణ వస్తుందన్నారు. రాష్ట్రంలో విద్యుత్ సమస్యల పైన ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే శోభా నాగి రెడ్డి డిమాండ్ చేశారు.
మరోమారు అసెంబ్లీ ముందుకు వ్యవసాయ కార్యాచరణ
వ్యవసాయ బడ్జెట్ వివాదంపై రాష్ట్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా వ్యవసాయ కార్యాచరణ ప్రణాళికను ప్రభుత్వం మరోమారు శాసనసభ, మండలిలో ప్రవేశపెట్టనుంది. ఇందుకోసం బడ్జెట్ అని ఉన్నచోట కార్యాచరణ ప్రణాళిక అని చేర్చి అధికారులు పుస్తకాలను తిరిగి ముద్రించారు.












Click it and Unblock the Notifications