హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జూ ఎన్టీఆర్: బాబుపై హరికృష్ణ ఛాన్స్ కోసం చూశారా?

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu-Jr Ntr-Harikrishna
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పైన ఆయన బావమరిది, తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణకు నాడు నాటుకున్న అసంతృప్తి ఇంకా తగ్గనట్లుగా కనిపిస్తోందంటున్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు మృతి తర్వాత తెలుగుదేశం పార్టీలో తనకు ప్రాధాన్యత లభించలేదనే కారణంతో హరికృష్ణ అప్పుడు అన్న తెలుగుదేశం పార్టీని స్థాపించారు.

అయితే, తర్వాత వచ్చిన ఎన్నికల్లో అన్న తెలుగుదేశం పార్టీ ఘోర ఓటమిని చవి చూసింది. ఆ తర్వాత బాబుకు దూరంగా ఉన్న హరికృష్ణ కొంతకాలం అనంతరం టిడిపి గూటికి చేరుకున్నారు. టిడిపి గూటికి చేరుకున్నప్పటికీ హరికృష్ణకు బాబుపై నాడు నాటుకున్న అసంతృప్తి ఇంకా తొలగిపోయి ఉండకపోవచ్చునని అంటున్నారు. అందుకే ఆయన పార్టీలో ఉంటున్నప్పటికీ బాబుకు అప్పుడప్పుడు తలనొప్పులు తీసుకు వస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

సమయం వచ్చినప్పుడల్లా బాబుపై హరికృష్ణ పైచేయి సాధించే ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. బాబు పైన హరికృష్ణ పలుమార్లు పరోక్షంగా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో బాబుతో పడక కొత్త పార్టీ పెట్టి ఫెయిలైన హరికృష్ణ.. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కారణంగా మరోసారి బాబుపై తనదైన శైలిలో అసంతృప్తిని వెల్లగక్కుతున్నారని చెబుతున్నారు. కొంతకాలం క్రితం హరి మాట్లాడుతూ... టిడిపి నందమూరి ఫ్యామిలీదే అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇది పార్టీలో, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

తప్పని పరిస్థితుల్లో, చేసేది లేకనే బాబు పక్కన టిడిపిలో హరి కొనసాగుతున్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు. బాబు నుండి నారా లోకేష్ చేతికి పార్టీ పగ్గాలు వెళ్లకుండా తన తనయుడు జూనియర్ చేతికి వచ్చేలా ఆయన తెరచాటు ప్రయత్నాలు చేశారని, చేస్తున్నారని చెబుతున్నారు. ఇప్పుడు జూనియర్‌కు ప్రజల్లో ప్రత్యేక గుర్తింపు ఉండటంతో అతని ద్వారా బాబు తనయుడు నారా లోకేష్‌కు చెక్ చెప్పాలని భావిస్తున్నారని అంటున్నారు.

హరికృష్ణ బాబుకు మద్దతు పలికిన సందర్భాలు లేకపోలేదు. బాబు వస్తున్నా మీకోసం పాదయాత్ర ప్రారంభించినప్పుడు అంతా హరికృష్ణే అయ్యారు. అలాంటి సందర్భాలు లేకపోలేదు. అయితే, బాబును లక్ష్యంగా చేసుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు మాత్రం విడిచి పెట్టడం లేదంటున్నారు. బాబుపై నాడు నాటుకున్న అసంతృప్తి హరిలో ఇప్పటికీ తగ్గక పోయి ఉండవచ్చునని అంటున్నారు. తాజాగా జూనియర్‌కు కాకుండా లోకేష్‌కు పగ్గాలు అప్పజెప్పే విధంగా బాబు చర్యలు ఆయనకు మరింత ఆగ్రహం కలిగిస్తున్నాయని అంటున్నారు.

English summary
It is said that Telugudesam Party senior leader and MP Nandamuri Harikrishna is still unhappy with party chief Nara Chandrababu Naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X