వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మంత్రులకు నో చెప్పిన కిరణ్: ఓయులో మళ్లీ ఉద్రిక్తత

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
హైదరాబాద్: తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి తలపెట్టిన సడక్ బంద్ కార్యక్రమానికి అనుమతివ్వాలని తెలంగాణ ప్రాంత మంత్రులు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని బుధవారం కలిసి విజ్ఞప్తి చేశారు. వారి విజ్ఞప్తిని ముఖ్యమంత్రి సున్నితంగా తిరస్కరించారు. మంత్రులు గీతా రెడ్డి, సునితా లక్ష్మా రెడ్డి, డికె అరుణ, శ్రీధర్ బాబు తదితరులు కిరణ్ వద్దకు వెళ్లి సడక్ బంద్ కార్యక్రమానికి ఇనుమతివ్వాలని కోరారు.

అందుకు స్పందించిన సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో అనుమతివ్వలేమని కిరణ్ వారికి నచ్చచెప్పారు. సడక్ బంద్ విషయంపై పోలీసులు చూసుకుంటారని, నిబంధనల ప్రకారమే ప్రభుత్వం అన్నింటిని ఎదుర్కొంటామని కిరణ్ చెప్పారు. రహదారుల దిగ్బంధంపై సుప్రీం కోర్టు తీర్పులున్నాయని ఆయన గుర్తు చేశారు. సుప్రీం తీర్పు నేపథ్యంలో అనుమతివ్వలేమని ఆయన మంత్రులకు చెప్పారు. మిలియన్ మార్చ్‌కు సడక్ బందుకు తేడా ఉందన్నారు.

గీత దాటిన వారిపై చర్యలు

అవిశ్వాస తీర్మానం సమయంలో గీత దాటిన ఎమ్మెల్యేలపై సిఎల్పీలో చర్చిస్తామని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. అవిశ్వాసం సమయంలో ఓటింగుకు పాల్గొనక పోవడంపై మంత్రి వట్టి వసంత్ కుమార్ వివరణ ఇచ్చారన్నారు. బాబ్లీ విషయంలో రాష్ట్రానికి అన్యాయం జరగకుండా చూస్తామన్నారు.

ఓయులో బైక్ ర్యాలీ

ఈ నెల 21న తలపెట్టిన సడక్ బంద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు బైక్ ర్యాలీ నిర్వహించారు. వారిని పోలీసులు ఓయు గేట్ వద్ద అడ్డుకున్నారు. ఈ సమయంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులపై విద్యార్థులు రాళ్లు రువ్వారు.

పోయేరోజులు దగ్గరపడ్డాయి

సడక్ బంద్ కార్యక్రమానికి ప్రభుత్వం అనుమతివ్వాలని తెలంగాణ రాజకీయ ఐక్యాకార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్ డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి పోయే రోజులు దగ్గర పడ్డాయన్నారు. దిల్‌సుఖ్‌నగర్‌లో పేలుళ్లకు పాల్పడిన వారిని పట్టుకోకుండా తమపై పోలీసులు ప్రతాపం చూపించడమేమిటని ప్రశ్నించారు. సడక్ బంద్‌కు పూర్తి మద్దతిస్తున్నట్లు భారతీయ జనతా పార్టీ ప్రకటించింది.

మరోవైపు సడక్ బంద్ నేపథ్యంలో మహబూబ్ నగర్ జిల్లాలో బైండోవర్ కేసులు పెడుతున్నారు. నిన్నటి వరకు 2200 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఈ రోజు మరికొందరు నేతలను అదుపులోకి తీసుకున్నారు. అనుమానంగా ఉన్న వారిని పోలీసు స్టేషన్‌కు తరలిస్తున్నారు.

English summary
CM Kiran Kumar Reddy did not considered Telangana Ministers appeal on TJAC's Sadak Bandh programme.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X