హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బ్రదర్ అనిల్ కుమార్ అక్రమాలు బయటకొస్తాయి: టిడిపి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Anil Kumar-Devineni Umamaheswara Rao
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల భర్త, ప్రముఖ క్రైస్తవ మత ప్రచారకుడు బ్రదర్ అనిల్ కుమార్ అక్రమాల పైన విచారణ జరిపించాలని తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి లేఖ రాసింది. బెనెతా సంస్థ ఉద్యోగి వీరభద్రా రెడ్డి మరణంపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ)చే విచారణ జరిపించాలని టిడిపి నేతలు ముఖ్యమంత్రిని కోరారు.

వీరభద్రా రెడ్డి మృతిపై విచారణ జరిపిస్తే బ్రదర్ అనిల్ కుమార్ అక్రమాలు బయటకు వస్తాయని టిడిపి నేత దేవినేని ఉమామహేశ్వర రావు అన్నారు. షర్మిల మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రలో వినియోగిస్తున్న కారు వీరభద్రా రెడ్డి పని చేసిన బెనితా సంస్థ పేరిటనే ఉందని ఆయన అన్నారు. బ్రదర్ అనిల్ కుమార్‌కు బినామి కొండల రావు అయితే.. కొండల రావుకు బినామీగా వీరభద్రా రెడ్డి ఉన్నారని ఆరోపించారు.

తెలంగాణపై తీర్మానం కోసం తెరాస పట్టు

తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు తెలంగాణపై తీర్మానం కోసం శాసనసభలో పట్టుబట్టారు. తీర్మానం కోరుతూ వారు స్పీకర్ పోడియం వద్దకు దూసుకు పోయారు. సభ్యులు ఎంతకూ శాంతించక పోవడంతో సభను స్పీకర్ గురువారానికి వాయిదా వేశారు. అంతకుముందు విపక్షాల ఆందోళనల మధ్య సభను రెండుసార్లు వాయిదా వేశారు. కాగా

బాబ్లీపై అఖిల పక్షం

బాబ్లీ ప్రాజెక్టు అంశంపై ఈ నెల 26న అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అంగీకరించారని టిడిపి నేత ఎర్రబెల్లి దయాకర రావు అన్నారు. రేపు తెలంగాణ ఐక్యకార్యాచరణ సమితి చేపట్టే సడక్ బందుకు సంబంధించి తమను ఎవరూ ఆహ్వానించలేదని, ఆహ్వానం వస్తే పరిశీలిస్తామన్నారు. ఈ నెల 26న సాయంత్రం నాలుగు గంటలకు బాబ్లీపై అఖిల పక్షం ఉంటుందని మంత్రి సుదర్శన్ రెడ్డి చెప్పారు.

English summary
Telugudesam Party has demanded CBI probe on Veerabhadra Rao's death.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X