హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఒత్తిడి: హైదరాబాద్ వర్సిటీ విద్యార్థి ఆత్మహత్య

By Pratap
|
Google Oneindia TeluguNews

 Depressed student of University of Hyderabad kills himself on campus
హైదరాబాద్: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం విద్యార్థి క్యాంపస్ ఆవరణలో హాస్టల్ గదిలో మంగళవారం ఆత్మహత్య చేసుకున్నడాు. 21 ఏళ్ల వయస్సు గల ఆ విద్యార్థి తీవ్రమైన ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతుడిని వరంగల్ జిల్లాకు చెందిన దళిత విద్యార్థి పి. రాజుగా గుర్తించారు.

రాజు లింగ్విస్టిక్స్‌లో ఎంఎ ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సు నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. అతను క్యాంపస్‌లోని ఎఫ్ హాస్టల్లో ఉంటున్నాడు. దిగ్భాంతికరంగా సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లో మధ్యాహ్నం మూడున్నర గంటలకు డిప్రెషన్... డిప్రెషన్... కిల్స్ మీ ఎవ్రీ డే (ఒత్తిడి... ఒత్తిడి... ప్రతి రోజూ చంపేస్తోంది) అంటూ మెసేజ్ పోస్టు చేశాడు. ఆ తర్వాత కొద్దిసేపటికి వీడ్కోలు చెబుతూ మెసేజ్ పోస్టు చేశాడు.

మిత్రులు అతని వద్దకు వచ్చి మాట్లాడారు. ఆ తర్వాత కొద్దిసేపటికి వెళ్లిపోయారు. వారు వెళ్లిపోయిన తర్వాత అతను ఆత్మహత్య చేసుకున్నాడు. సెమిస్టర్ రిజిస్ట్రేషన్‌కు అతన్ని అనుమతించలేదని, ఆ గడువు డిసెంబర్‌తో ముగిసిందని, రిజిస్ట్రేషన్ లేకుండా పరీక్షలకు అనుమతించరని, బ్యాక్ లాగ్స్ కూడా ఉన్నాయని అంటున్నారు

కాగా, విద్యార్థులు హెచ్‌సియు వైస్ చాన్సలర్ రామకృష్ణ రామస్వామిని ఘెరావ్ చేశారు. రాజును సెమిస్టర్ రిజిస్ట్రేషన్‌కు ఎందుకు అనుమతించలేదని నిలదీశారు. బుధవారం క్యాంపస్ బంద్ జరుగుతోంది. విశ్వవిద్యాలయం నిర్లక్ష్యాన్ని నిరసిస్తున్నట్లు అంబేడ్కర్ విద్యార్థి సంఘం ప్రతినిధులు అంటున్నారు.

English summary

 A 21-year old student of the University of Hyderabad committed suicide by hanging at his hostel room on the campus on Tuesday. Police claim depression triggered by poor performance in academics may have forced the youth to resort to the extreme step.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X