వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అసెంబ్లీలో పోలీస్‌పై దాడి: ఐదుగురు ఎమ్మెల్యేలపై వేటు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Five MLAs suspended by Assembly
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ప్రాంగణంలో పోలీసు అధికారి సచిన్ సూర్యవంశిపైన దాడికి పాల్పడిన ఐదుగురు ఎమ్మెల్యేలపై వేటు పడింది. ఈ దాడికి పాల్పడిన ఎమ్మెల్యేలను ఈ ఏడాది డిసెంబర్ 31వ తేది వరకు సస్పెండ్ చేశారు. క్షితిజ్ ఠాకూర్(బహుజన్ వికాస్ అఘాది), రామ్ కదం(ఎంఎన్ఎస్), రాజన్ సాల్వీ(శివసేన), జైకుమార్ రావల్(బిజెపి), ప్రదీప్ జైశ్వాల్(స్వతంత్ర సభ్యుడు)లు సస్పెండైన వారిలో ఉన్నారు.

కాగా, అసెంబ్లీ ప్రాంగణంలో ఓ పోలీసు అధికారిని ఎమ్మెల్యేలు చితకబాదిన సంఘటన మహారాష్ట్రలో మంగళవారం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అసిస్టెంట్ పోలీసు ఇన్స్‌పెక్టర్ సచిన్ సూర్వవంశిని ఎమ్మెల్యేలు చితకబాదారు. వసాయి నియోజకవర్గ ఎమ్మెల్యే క్షితిజ్ ఠాకూర్ వాహనాన్ని బాంద్రా-వోర్లి ప్రాంతంలో నిన్న(సోమవారం) సుర్యవంశి అనే ఈ పోలీసు అధికారి ఆపారు. ఎమ్మెల్యే పట్ల పోలీసు అధికారి మిస్ బిహేవ్ చేశారని ఆరోపిస్తూ ఎమ్మెల్యేలు ఆయనపై ఈ రోజు దాడికి పాల్పడ్డారు.

నిన్న అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయం అనంతరం ఎమ్మెల్యే ఠాకూర్ సదరు పోలీసు అధికారి పైన ప్రివిలేజ్ నోటీసు ఇచ్చారు. తన వాహనాన్ని బాంద్రా-వోర్లీ ప్రాంతంలో అధికారి నిలిపివేసి బిస్ బిహేవ్ చేశారని ఎమ్మెల్యే ఆరోపిస్తూ ప్రివిలేజ్ నోటీసు ఇచ్చారు. ఎమ్మెల్యే చెప్పిన ప్రకారం... ఈ ఘటన సోమవారం చోటు చేసుకుంది. అతను అసెంబ్లీకి వెళ్తుండగా పోలీసు అధికారి వాహనాన్ని ఆపి మిస్ బిహేవ్ చేశాడు.

తన పట్ల మిస్ బిహేవ్ చేసిన పోలీసు అధికారిని వెంటనే సస్పెండ్ చేయాలని ఠాకూర్ డిమాండ్ చేశారు. అదే సమయంలో అధికారి సూర్యవంశి విజిటర్స్ గాలరీలో కూర్చుని కనిపించారు. అతనిని ఎమ్మెల్యే గుర్తించారు. దీంతో ఆయనకు తోడు నలుగురు ఎమ్మెల్యేలు సూర్యవంశి వద్దకు దూసుకు వెళ్లి అతనిని కొట్టారు.

వెంటనే తేరుకున్న విధాన సభ సెక్యూరిటీ సిబ్బంది సూర్యవంశిని బయటకు తీసుకు వెళ్లారు. ఓ గదిలోకి తీసుకు వెళ్లి డాక్టర్లతో చెక్ చేయించారు. హోంమంత్రి ఆర్ఆర్ పాటిల్, ప్రధాన ప్రతిపక్ష నేత ఏక్‌నాథ్‌తో పాటు పలువురు ఎమ్మెల్యేలు పోలీసు అధికారిని పరామర్శించారు.

English summary
Five Maharashtra MLAs have been suspended from the state Assembly on Wednesday after they allegedly assaulted a policeman. The MLAs have been suspended till the end of the year for assaulting a police officer in Vidhan Sabha.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X