తమిళ గొడవ: రాజ్యసభలో స్పృహ తప్పిన డిఎంకె ఎంపి

Tamilnadu Map
న్యూఢిల్లీ: శ్రీలంక తమిళుల సమస్యపై నినాదాలు చేస్తున్న సమయంలో డిఎంకె ఎంపీ వాసంతి స్టాన్లీ రాజ్యసభలో బుధవారం స్పృహ తప్పి పడిపోయారు. శ్రీలంక తమిళుల సమస్యపై రాజ్యసభ అట్టుడికింది. తన పార్టీ సభ్యులు, అన్నాడియంకె సభ్యులు ఎల్టిటిఇ చీఫ్ ప్రభాకరన్ కుమారుడు శ్రీలంక బలగాల చేతిలో హతమైన తీరుకు సంబంధించిన ఫొటోలను ప్రదర్శిస్తూ ఆందోళనకు దిగిన సమయంలో స్టాన్లీ గొంతు చించుకుని నినాదాలు చేశారు.

స్టాన్లీ స్పృహ తప్పి పడిపోవడంతో అధ్యక్ష స్థానంలో ఉన్న రేణుకా చౌదరి సభను వెంటనే మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేసి వైద్యులను పిలిపించారు. రాజ్యసభలో స్టాన్లీ స్పృహ కోల్పోయి పడిపోయారు. స్టాన్లీని వెంటనే సఫ్దర్‌జంగ్ ఆస్పత్రికి తరలించారు. ఇద్దరు వైద్యులు డిఎంకె ఎంపీని పరీక్షించారు. స్ట్రెచర్, వీల్ చైర్ కూడా తెప్పించారు. అయితే స్టాన్లీ ఇతర సభ్యుల భుజాల మీద బరువు వేసి నడవడానికే సిద్ధపడ్డారు.

అంబికా సోనీ, దగ్గుబాటి పురంధేశ్వరి, రాజీవ్ శుక్లా వంటి అధికార కాంగ్రెసు పార్టీ సభ్యులు, అన్నాడియంకె సభ్యులు, ఇతర పార్టీల సభ్యులు స్టాన్లీకి సహాయం చేయడానికి తక్షణమే ముందుకు వచ్చారు. అంతకు ముందు సభ శ్రీలంక తమిళుల సమస్యపై గందరగోళం చెలరేగడంతో మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది.

సభ తిరిగి సమావేశమైన తర్వాత డిఎంకె, అన్నాడియంకె సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. తమ పార్టీ నేత ములాయం సింగ్‌పై చేసిన వ్యాఖ్యలకు గాను మంత్రి బేణీ ప్రసాద్ వర్మకు ఉద్వాసన పలకాలని ఇదే సమయంలో ఎస్పీ సభ్యులు ఆందోళనకు దిగారు. ఇంతలో స్టాన్లీ నినాదాలు చేస్తూ పడిపోయారు.

సభను వాయిదా వేసిన తర్వాత రేణుకా చౌదరి వెల్‌లోకి వచ్చి ఎలా ఉందని స్టాన్లీని అడిగారు. బ్రేక్ ఫాస్ట్ చేశారా, మేడమ్ అని అడిగారు. స్టాన్లీని బయటకు తీసుకుని వెళ్లడానికి వీలు కల్పించాలని మిగతా సభ్యులకు సూచించారు. ఆస్పత్రికి తీసుకుని వెళ్లడానికి ముందు స్టాన్లీని సభ్యులు కుర్చీలో కూర్చోబెట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+