• search

మే 5న కర్నాటకలో ఎన్నికలు: ఎపిలో వేటుపై సస్పెన్స్

By Srinivas
Subscribe to Oneindia Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  Karnataka
  న్యూఢిల్లీ: కర్నాటక శాసనసభ ఎన్నికలకు బుధవారం షెడ్యూల్ విడుదలయింది. కర్నాటకలో ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. ఈ ప్రభుత్వ పదవీకాలం జూన్ 3తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం కర్నాటక శాసనసభ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఏప్రిల్ 10న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుంది. ఏప్రిల్ 17న నామినేషన్‌ల స్వీకరణ ఆఖరు తేది.

  ఏప్రిల్ 18న నామినేషన్‌ల పరిశీలన జరుగుతుంది. ఏప్రిల్ 20వ తేదిన నామినేషన్‌ల ఉపసంహరణకు తుది గడువు. మే 5వ తేదిన శాసనసభకు ఎన్నికలు జరుగుతాయి. మే 8న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. కర్నాటకలో 224 శాసనసభ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయని, 4.18 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని ఎన్నికల సంఘం తెలిపింది. ఈవిఎంల ద్వారానే ఓటింగ్ నిర్వహిస్తామని, 98.6 శాతం ఓటరు గుర్తింపు కార్డులు జారీ చేసినట్లు తెలిపింది. మీడియాలో చెల్లింపు వార్తలపై నిఘా పెట్టామని, ఎన్నికలకు 50,446 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.

  మధ్యంతరానికి సిద్ధం కావాలని రాహుల్ పిలుపు

  మధ్యంతర ఎన్నికలకు సిద్ధం కావాలని ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. ఆయన ఎంపీలకు మధ్యంతర హెచ్చరికలు జారీ చేశారు. డిఎంకె యూపిఏకు మద్దతు ఉపసంహరించుకోవడంతో కేంద్రం ఇబ్బందుల్లో పడింది. ఈ నేపథ్యంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధం కావాలని రాహుల్ గాంధీ నేతలకు సూచించారు. నియోజకవర్గాల్లో ఎక్కువ కాలం గడపాలని ఆదేశించారు. ఇప్పటికే ఆయన రెండు మూడు రాష్ట్రాల పిసిసి అధ్యక్షులతో భేటీ అయ్యారు. ఎస్పీ, బిఎస్పీ బయటి నుండి మద్దతిస్తున్నప్పటికీ రాహుల్ గాంధీ వారిపై నమ్మకంగా లేనట్లుగానే కనిపిస్తోంది.

  ఆంధ్రప్రదేశ్‌లో వేటుపై వేడి.. ఉప ఎన్నికలపై సస్పెన్స్

  మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం సమయంలో విప్ ధిక్కరించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గ తమ పార్టీ ఎమ్మెల్యేల పైన కాంగ్రెసు పార్టీ వేటు వేసే విషయంపై చర్చిస్తోంది. ఇప్పటికే పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ గీత దాటిన ఎమ్మెల్యేలపై వేటు వేసే విషయమై పార్టీ అధిష్టానంతో చర్చిస్తున్నారు. గీత దాటిన వారిపై వేటు వేసి ఉప ఎన్నికలకు వెళ్తారా? మరో రెండు నెలలు ఆగి ఉప ఎన్నికలు రాకుండా వారిపై చర్యలు తీసుకుంటారా? అనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  The Karnataka Assembly polls will be held on May 5 (Sunday) and the counting will on May 8 (Wednesday). Announcing the schedule of the elections today, Chief Election Commissioner V Sampath said the elections will have 50,446 polling stations and 4.18 crore voters are eligible for choosing their candidates.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more