హీరోగా మంత్రి గల్లా అరుణ కుమారి మేనల్లుడు కృష్ణ

ఇప్పుడు గల్లా అరుణ కుమారి మేనల్లుడు కృష్ణ మాధవ్ టాలీవుడ్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. చికాగోలో థియేటర్ ఆర్ట్స్ చేసిన కృష్ణ మాధవ్ మహేశ్ కొన్ని చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా కూడా పని చేశారు. ఆయన హీరోగా నటిస్తున్న తొలి చిత్రం 'హృదయం ఎక్కడున్నది' చిత్రం తొలి షెడ్యూల్ పూర్తయింది.
తమిళ దర్శకుడు ఎఆర్ మురుగదాస్ శిష్యుడు ఆనంద్ ఈ సినిమాతో దర్శకునిగా పరిచయమవుతున్నారు. కన్నడ నటి అనూష, సంస్కృతి కథానాయికలు. కీర్తి మీడియా, హైమా క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. వేసవిలో ఈ సినిమా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. సినిమా నేపథ్యం ఉన్న కుటుంబాలు రాజకీయాల్లోకి, రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబాలు సినిమాల్లోకి వెళ్లడం మామూలే.












Click it and Unblock the Notifications