వైయస్‌పై మళ్లీ మోత్కుపల్లి: బొత్స ఆసక్తికర వ్యాఖ్య

విద్యుత్‌పై చర్చించకుండా ప్రభుత్వం పారిపోతుందేమోనని తాము ముఖ్యమంత్రి చాంబర్ వద్ద అడ్డంగా కూర్చొని మరీ చర్చకు ఒప్పించామని, తీరా చర్చ మొదలైన తర్వాత వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేలు దాన్ని అడ్డుకున్నారని, ప్రైవేటు కంపెనీలకు పెద్దపీట వేసి వైయస్ రాష్ట్రాన్ని నాశనం చేశారని, ఇంకా ఏ మొహం పెట్టుకొని పోడియం వద్దకు వచ్చారని ప్రశ్నించారు. అవినీతితో ఇప్పటికే వారి మొహాలు నల్లగా మారిపోయాయన్నారు.
మళ్లీ వారికి నల్ల చొక్కాలా అని ఎద్దేవా చేశారు. మీరే కాంగ్రెస్.. కాంగ్రెసే మీరన్నారు. ఇక కాంగ్రెస్‌ను ఏమని తిడతారన్నారు. తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ బాగోతం బయపడతోందని, ఈ రెండు కాంగ్రెస్‌ల సంగతి తాము తేలుస్తామన్నారు. టిడిపి హయాంలో రాష్ట్ర బడ్జెట్ రూ.45 వేల కోట్లు ఉంటే అందులో విద్యుత్ కోసం రూ.8 వేల కోట్లు కేటాయించారని, కాంగ్రెస్ పార్టీ ఈ సంవత్సరం మొత్తం బడ్జెట్ రూ. 1.61 లక్షల కోట్లు ఉంటే అందులో విద్యుత్‌కు కేవలం రూ. 3.5 వేల కోట్లు మాత్రం కేటాయించిందని గాలి ముద్దుకృష్ణమ నాయుడన్నారు.
బొత్స ఆసక్తికర వ్యాఖ్య
ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఆసక్తికర వ్యాఖ్య చేశారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చాక మొదటి నాలుగేళ్లు అధికార పార్టీ పరిపాలనపై దృష్టి సారించాలని, చివరి సంవత్సరం ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రతిపక్షాల మాదిరి వ్యవహరించాలని బొత్స అన్నారు. ఎన్నికలకు ఏడాది సమయమే ఉన్నందున ప్రజా సమస్యలపై లోతైన అధ్యయనం చేయాలన్నారు. సర్‌చార్జీలను ప్రజలు మోయక తప్పదని, ఇతర భారాన్ని మాత్రం వేయడం లేదని చెప్పారు. విద్యుత్ చార్జీలను పెంచడం తన అభిమతం కాదని ప్రభుత్వానికి వెల్లడించానన్నారు.












Click it and Unblock the Notifications