అఖిలేష్‌పై అద్వాని: నిజమని కొడుకుపై ములాయం ఫైర్

అఖిలేష్ యాదవ్ పాలన బాగోలేదని, ఆయన కొరడా ఝుళిపిస్తే తప్ప అది సజావుగా సాగదని అభిప్రాయపడ్డారు. యూపి చాలా చెడ్డ రాష్ట్రమని, ఇక్కడ అవినీతి విశృంఖలంగా ఉందని అద్వానీ చెప్పారని, ఆయనెప్పుడూ అబద్ధాలు చెప్పరని ములాయం సింగ్ యాదవ్ అన్నారు. శాంతిభద్రతల పరిస్థితిని నియంత్రించడంలో విఫలమైతే ముఖ్యమంత్రి అసమర్థుడన్న ముద్ర పడుతుందన్నారు. ప్రభుత్వ పాలనలో మెత్తగా ఉంటే కుదరదని సలహా ఇచ్చారు.
యూపి ప్రభుత్వంలో వ్యక్తిపూజ ఎక్కువైపోతోందని, అఖిలేష్ యాదవ్ కొరడా ఝుళిపిస్తే తప్ప ప్రయోజనం లేదని స్పష్టం చేశారు. పోలీసు స్టేషన్లు, తహసీల్దార్ కార్యాలయాలు అవినీతి నిలయాలుగా మారాయని విమర్శించారు. ముఖ్యమంత్రి వెంటనే దీనిపై సమీక్షించి అక్రమాలు బయటపడిన చోట కలెక్టర్లు, ఎస్పీలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
మరోవైపు కేంద్ర మంత్రి బేణీ ప్రసాద్ వర్మ ములాయంపై మరోసారి ధ్వజమెత్తారు. అసలాయన సమాజ్‌వాదీయే కాదంటూ ఢిల్లీలో విమర్శించారు. ఇటీవల పార్లమెంటులో ములాయం సింగ్ యాదవ్ పైన తీవ్రవాద సంబంధాల వ్యాఖ్యలు చేసి విమర్శల పాలైన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications