'సిఎం' కేసు వాయిదా: శంకరన్నకు కిరణ్ పరామర్శ

ముఖ్యమంత్రిని కాంగ్రెసు పార్టీ శాసనసభా పక్షం ఎన్నుకోలేదని, ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ ఎన్నుకున్న వ్యక్తి అని, సిఎల్పీ కాకుండా సోనియా ఎన్నుకున్నందున ఆయన ముఖ్యమంత్రిగా అనర్హుడని ఉప్పు వెంకటరమణ పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ రోజు వాదనలు ముగిశాయి.
ముఖ్యమంత్రిని కలిసిన శంకర రావు
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని మాజీ మంత్రి శంకర రావు సోమవారం కలిశారు. ఈ సందర్భంగా శంకర రావు ఆరోగ్య పరిస్థితిని ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. శంకర రావు కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కిరణ్‌తో శంకర రావు కాసేపు మాట్లాడారు. అనంతరం శంకర రావు స్పీకర్ నాదెండ్ల మనోహర్ కలుసుకున్నారు.
జానా రెడ్డి ఆస్తుల విచారణ వేరే బెంచ్‌కి
పంచాయతీరాజ్ శాఖ మంత్రి జానా రెడ్డి ఆస్తులపై దర్యాఫ్తు చేయాలంటూ దాఖలైన పిటిషన్ పైన విచారణనను హైకోర్టు మంగళవారానికి వాయిదా వేసింది. జానా రెడ్డి ఆస్తుల కేసు విచారణను వేరే బెంచ్‌కు బదలీ చేయాలని హైకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.












Click it and Unblock the Notifications