వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ: జైపాల్, జానా రిజైన్ యోచన, అనుమానం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Jana Reddy and Jaipal Reddy
హైదరాబాద్/న్యూఢిల్లీ: తెలంగాణ కోసం కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.జానా రెడ్డిలు రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. మే నెలలోగా తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోని పక్షంలో ఆ తర్వాత రాజీనామా చేయాలనే నిర్ణయానికి వారు వచ్చినట్లుగా తెలుస్తోంది. మంత్రి జానా రెడ్డి తన సహచరులతో మే తర్వాత తెలంగాణపై తేల్చకుంటే రాజీనామా చేస్తానని చెప్పినట్లుగా సమాచారం.

కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి కూడా రాజీనామాకే మొగ్గు చూపిస్తున్నారని తెలుస్తోంది. రాజీనామా అంశంపై జైపాల్ రెడ్డి ఇప్పటికే తెలంగాణ ప్రాంత కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యులతో చర్చించినట్లుగా తెలుస్తోంది. రాజీనామా చేసిన అనంతరం తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించాలని జైపాల్ రెడ్డికి ఎంపీలు సూచించినట్లుగా తెలుస్తోంది. అయితే, అందుకు తన ఆరోగ్యం సహకరించదని ఆయన చెప్పారట. అయితే, మంత్రి పదవికి రాజీనామా చేసే ఆయన కాంగ్రెసులోనే కొనసాగాలని చూస్తున్నారట. అదే సమయంలో 2014 ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లుగా కూడా తెలుస్తోంది.

తెలంగాణ ఉద్యమానికి తాను నాయకత్వం వహించకున్నా పూర్తి సహకారం అందిస్తానని ఆయన ఎంపీలకు చెప్పారట. మే నెలాఖరులోగా తెలంగాణపై తేల్చాలని తెలంగాణ ప్రాంత ఎంపీలు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాశారు. మే నెలలోగా తేల్చకుంటే రాజకీయ సమీకరణాలు మారుతాయని హెచ్చరించినట్లుగా తెలుస్తోంది.

సాధారణ ఎన్నికలకు మరెంతో సమయం లేనందున తెలంగాణ ప్రాంత ఎంపీలు ప్రత్యేక రాష్ట్రంపై జాగ్రత్త పడుతున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల జైపాల్ రెడ్డి, జానా రెడ్డిలతో పాటు మంత్రులు, అధికార పార్టీ తెలంగాణ నేతలను తెలంగాణవాదులు తీవ్రంగా తప్పు పడుతున్నారు. ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో తెలంగాణవాదులు మరింత టార్గెట్ చేసుకుంటే పరిస్థితి విషమిస్తుందని భావించినందువల్లే జానా, జైపాల్‌లు రాజీనామాలకు సిద్ధపడుతున్నట్లుగా తెలుస్తోంది.

అనుమానాలన్న జానా!

తెలంగాణ ఏర్పాటుపై కాంగ్రెసు మీద జానా రెడ్డి అనుమానాలు వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. అధిష్టానం తెలంగాణ ఇస్తుందనే నమ్మకం లేదని, వస్తే పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లోపే తెలంగాణపై కేంద్రం నుండి ప్రకటన వస్తుందని, అందుకోసం ఒత్తిడి చేస్తున్నామని, తమ ప్రయత్నాలు ఫలించనప్పుడు ఏం చేయాలో ఆలోచిస్తామని జానా రెడ్డి చెప్పారు.

English summary
It is said that Central Minister Jaipal Reddy and state minister Jana Reddy may resign for their minister posts after May month.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X