అనుభవిస్తారు: షర్మిల శాపనార్థాలు, ఇద్దరడ్డుకున్నారు

Sharmila
గుంటూరు: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి అన్యాయం చేసే వారు ఇంతకు ఇంత అనుభవిస్తారని ఆయన సోదరి షర్మిల ఆదివారం అన్నారు. షర్మిల పాదయాత్ర వంద రోజులు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఆదివారం రాత్రి మంగళగిరిలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరంలు కలిసి జగన్ బెయిల్‌ను అడ్డుకున్నారన్నారు.

జగన్ పైన విచారణ పూర్తి కాలేదని, ఛార్జీషీటు ఎప్పుడేస్తామో చెప్పలేమని సిబిఐ బాధ్యతారాహిత్యంగా మాట్లాడతోందన్నారు. ఆరునెలల్లోపు విచారణ పూర్తి చేసి ఛార్జీషీటు వేయమని సుప్రీం కోర్టు చెప్పినా అది పాటించడం లేదన్నారు. జగన్‌కు బెయిల్ వస్తుందన్న ప్రతిసారి సిబిఐ నుంచి చంద్రబాబు, చిదంబరం వరకు అడ్డుపడుతున్నారన్నారు. రాష్ట్రంలో నిశ్శబ్ద విప్లవం మొదలైందని, ప్రజాస్వామ్యాన్ని వెక్కిరిస్తూ నీచమైన కుట్ర రాజకీయాలకు పాల్పడుతున్న పార్టీలకు తగిన గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధమయ్యారని అన్నారు.

నాడు దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి రాష్ట్రంలో పాదయాత్రను ప్రారంభించినప్పుడు ఎంత అనిశ్చితి వుందో.. తానుయాత్రను చేపట్టినప్పుడు కూడా అదే అనిశ్చితి నెలకొని వుందని చెప్పారు. పాదయాత్ర చేస్తున్న చంద్రబాబు ప్రజల కష్టాలను చూస్తూనే కాంగ్రెస్ ప్రభుత్వ పక్షాన నిలబడి వారికి కొమ్ము కాయడాన్ని ప్రజలందరూ గమనించాలన్నారు. అవిశ్వాస తీర్మానంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన చంద్రబాబు ఇక పాదయాత్ర చేయడం దేనికని ప్రశ్నించారు.

రాజన్న రాజ్యాన్ని జగనన్న మాత్రమే తీసుకురాగలడన్న భరోసాను ప్రజల్లో కల్పించేందుకే తాను ఈ పాదయాత్ర చేపట్టినట్టు వివరించారు. పగలనక, రేయనక, ఎండనక, వాననక ప్రజల మధ్యన వుంటూ ప్రజా సమస్యలపై పోరాడుతున్న జగన్‌ను చూచి కాంగ్రెస్, దేశం బడా నేతలు భయపడిపోయారన్నారు. జగన్ ఇలాగే కొనసాగితే రాజన్నకు నిజమైన వారసుడిగా మిగులుతాడని... తమ పార్టీలు భూస్థాపితమవుతాయని, తమ దుకాణాలను మూసుకోవలసి వస్తుందన్న ఆందోళనతో కుట్రలు పన్ని అబద్దపు కేసులు పెట్టి జగనన్నను జైలు పాల్జేశారని విమర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+