వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షర్మిల, బాబు పాదయాత్రలు చేస్తుంటే ఇలాగేనా: విహెచ్

By Pratap
|
Google Oneindia TeluguNews

V Hanumanth Rao
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు వైయస్ షర్మిల పాదయాత్రలు చేస్తూ ప్రజల్లోకి వెళ్తుంటే కాంగ్రెసు రాష్ట్ర నాయకత్వం కనీసం సమావేశం కూడా ఏర్పాటు చేయకపోతే ఎలా అని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ప్రశ్నించారు.

పార్టీలో నేతల మధ్య అనేక వైరుధ్యాలున్నాయని, వాటిపై చర్చించేందుకు వేదిక అవసరమని ఆయన అన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పార్టీ నేతలంతా ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఇందుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పార్టీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. పార్టీలో కీలకమైన నాయకులు ఒకరికొకరు సంబంధం లేకుండా మాట్లాడుతున్నారని ఆయన తప్పు పట్టారు.

పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టేందుకు తమ పార్టీ అధిష్టానంపై తాము ఒత్తిడి తెస్తామని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పారు. ఏప్రిల్ 22వ తేదీన జరిగే పార్లమెంటు సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు పెట్టించి, ఆమోదింపజేసుకునేందుకు కృషి చేస్తామని ఆయన అన్నారు.

తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శానససభ్యుడు హరీష్ రావుతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్న మాటలు బాధాకరంగా ఉన్నాయని ఆయన అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అన్ని ప్రాంతాలవారిని సమానంగా చూడాలని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణకు అడ్డు ఇంటి దొంగలేనని ఆయన అన్నారు.

English summary

 Congress senior leader V Hanumanth Rao expressed unhappy with the working style of CM Kiran kumar Reddy and PCC chief Botsa Satyanarayana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X