కూతురు పెళ్లి, ఈడి విచారణ: సాయిరెడ్డికి ఊరట

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడి) విచారణకు హాజరు కావడానికి వీలుగా కూడా తనపై పెట్టిన ఆంక్షలను సడలించాలని విజయసాయి రెడ్డి కోరారు. ఈనెల 27 నుంచి జూన్ 10 వరకు ఆయన బెయిల్‌పై ఆంక్షలను సడలిస్తూ కోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆస్తుల కేసులో నిందితుడు విజయసాయి రెడ్డికి తద్వారా ఊరట లభించింది. జగన్ ఆస్తుల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడి) ముందు హాజరు కావడానికి, తన కూతురు పెళ్లికి హైదరాబాద్ విడిచి వెళ్లేందుకు అనుమతించాలని కోరుతూ విజయసాయిరెడ్డి కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.
విజయసాయి రెడ్డికి పెట్టిన ఆంక్షలను సడలించడానికి సిబిఐ అభ్యంతరం చెప్పలేదు. ఈ స్థితిలో తన నిర్ణయాన్ని కోర్టు శుక్రవారంనాడు సోమవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు సోమవారం కోర్టు నిర్ణయం వెలువడింది.












Click it and Unblock the Notifications