• search
  • Live TV
గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఎన్నారై భార్య: శాడిస్టు మొగుడు, పారిపోయాడు

By Pratap
|
Guntur District
గుంటూరు: భార్యను చిత్రహింసలు పెడుతున్న ఓ ఎన్నారైని పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. తనపై కేసులు నమోదు కావడంతో భార్యను చిత్రహింసలు పెట్టిన వంశీకృష్ణ అనే ఎన్నారై అమెరికాకు పారిపోయి డిసెంబర్ 10న కాలిఫోర్నియా కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అమెరికా చట్టం ప్రకారం భార్య భర్తకు విడాకులు ఇస్తే వారి పేరున ఉన్న ఆస్తులను చెరిసమానంగా పంచుతారు. అప్పటికే ఆయన భార్య అమెరికాలో ఆర్థికంగా స్థిరపడి మంచి జీతంతో ఆస్తులు సంపాదించుకుంది. వీటిలో సగం కాజేయాలనే వంశీకృష్ణ విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు బాధితురాలి తండ్రి తెలిపారు.

గృహ హింస చట్టంతో పాటు దాడి కేసు కూడా నమోదు కావడంతో పోలీసులు వంశీకృష్ణ అరెస్ట్‌కు రెడ్‌కార్నర్ నోటీసు జారీ చేశారు. త్వరలోనే ఆయన పాస్‌పోర్ట్‌ను సీజ్ చేసి, అరెస్ట్ చేసి ఇండియాకు తీసుకువచ్చే అవకాశం ఉంది. తమ కూతురు జీవితాన్ని నాశనం చేసి, ఆర్థికంగానూ ఆమెను దెబ్బతీయడానికి కుట్ర పన్నిన వంశీకృష్ణపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితురాలి తండ్రి కోరుతున్నారు. పోలీసులు అక్కినేని వంశీకృష్ణపై కేసు నమోదు చేసి, రెడ్ కార్నర్ నోటీసు జారీ చేశారు.

వంశీకృష్ణ సొంత ఊరు కృష్ణా జిల్లా బొడ్డపాడు. విజయవాడకు చెందిన ఓ వ్యాపారి కొన్నేళ్ల క్రితం హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. ఆయన కుమార్తె 2000 సంవత్సరంలో అమెరికా వెళ్లి ఎంఎస్ చేశారు. అప్పటికే అమెరికాలో ఉన్న వంశీకృష్ణకు 2004లో ఆ వ్యాపారవేత్త తన కూతురినిచ్చి పెళ్లి చేశారు. పెళ్లి సమయంలో రూ. 10 లక్షల నగదు, బంగారం ముట్టచెప్పారు. పెళ్లయ్యేనాటికి వంశీకృష్ణ షికాగోలో పీహెచ్‌డీ చేస్తున్నాడు. ఆయన భార్య కాలిఫోర్నియాలో ఉండేవారు.

మూడేళ్లపాటు అలా ఉంటూ నెలకు ఒకటి రెండుసార్లు కలుసుకునేవారు. 2006లో ఆమె గూగుల్‌లో చేరారు. తర్వాత భర్తకు కూడా అక్కడే ఉద్యోగం ఇప్పించారు. 2007 నుంచి ఇద్దరూ ఒకే చోట కలిసి ఉండటం ప్రారంభించారు. అప్పుడు వంశీకృష్ణ అసలు స్వరూపం బయటపడింది. భార్యను మానసికంగా చిత్రహింసలు పెట్టేవాడు. వారాంతంలో బయటకు వెళ్లే పరిస్థితి కూడా లేకుండా హింసించడం మొదలుపెట్టాడు. ఆమె తరఫు బంధువులను దూరంగా పెట్టేవాడు. ఈ బాధలు భరించలేక 2011 జూన్‌లో భర్త నుంచి విడిపోయారు.

2012 మార్చిలో వంశీకృష్ణ భార్యను బతిమాలి తిరిగి కాపురానికి తెచ్చుకున్నాడు. తర్వాత కూడా అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. ఇద్దరూ గత ఏడాది నవంబర్‌లో ఇండియా వచ్చారు. ఇంటికి వచ్చాక భర్త వేధింపులను ఆమె తల్లిదండ్రుల వద్ద ఏకరవు పెట్టుకుని అతడితో కాపురం చేయలేనన్నారు. దీంతో దిగ్భ్రాంతికి గురైన ఆమె తల్లిదండ్రులు దీనిపై మాట్లాడేందుకు డిసెంబర్ 2న గుంటూరు జిల్లా మంగళగిరిలోని వంశీకృష్ణ ఇంటికి వెళ్లాడు. తమ కుమార్తెను వేధింపులకు గురిచేస్తున్నట్లు ఆయన తల్లిదండ్రులకు వివరిస్తుండగానే వంశీకృష్ణ రెచ్చిపోయాడు. మామపై దాడి చేసి గాయపరిచాడు.

దీనిపై ఆయన మంగళగిరి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైతే అమెరికా వెళ్లడం కుదరదని డిసెంబర్ 3న హుటాహుటిన విమానం ఎక్కేశాడు. మానసిక రోగాన్ని దాచి ఉంచి పెళ్లి చేసుకోవడమేకాక వేధింపులకు గురి చేస్తున్న భర్తపై బాధితురాలు డిసెంబర్ 12న హైదరాబాద్‌లోని ఉమెన్ ప్రొటెక్షన్ సెల్‌లో ఫిర్యాదు చేశారు. అప్పటికే అతనిపై మంగళగిరి పోలీస్ స్టేషన్‌లో కేసునమోదైంది. వంశీకృష్ణ, ఆయన తల్లిదండ్రులు అక్కినేని మాధవరావు, ధనలక్ష్మిలపై కేసు నమోదు చేశారు. ఆ కేసులో మాధవరావు, ధనలక్ష్మిలను అరెస్ట్ చేశారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Police have issued red corner notice against an NRI Vamshikrishna in a case filed against him by his wife.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more