హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మొదటి భార్యకు నిత్య పెళ్లి కొడుకు బెదిరింపు మెయిల్స్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Hyderabad
హైదరాబాద్: మొదటి భార్యకు బెదిరింపు మెయిల్స్ పంపడంతో పాటు మరో మోసానికి సిద్ధమవుతున్న ఓ వ్యక్తిని హైదరాబాదు పోలీసులు ఆదివారం సాయంత్రం అరెస్టు చేశారు. ఇతని పైన ఐటి చట్టం 66ఏ కింద కేసు నమోదు చేసుకున్నారు. సిసిఎస్ అదనపు డిసిపి జావెద్ ఆదివారం కేసు వివరాలను వెల్లడించారు. సంతోష్ కుమార్ నాయుడు అనే 51 ఏళ్ల వ్యక్తి సికింద్రాబాదులోని ఎస్‌డి రోడ్డు నివాసి.

సంతోష్ గతంలో ఆదాయపు పన్ను శాఖలో ఎల్‌డి క్లర్కుగా పని చేశాడు. సంతోష్ కుమార్‌కు 1985లో తెల్మా అనే మహిళతో వివాహం అయింది. కొడుకు పుట్టాక అదనపు కట్నం కోసం ఆమెను వేధించాడు. ఎస్‌బిఐకు సంబంధించిన రు.4 లక్షలు కాజేసిన కేసులో సంతోష్ కుమార్ నాయుడును 1991లో అబిడ్స్ పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు.

ఆ తర్వాత బెయిల్ పైన బయటకు వచ్చాడు. భార్య విడాకులు తీసుకుంది. ఆ తర్వాత తనకు ఇంకా పెళ్లి కాలేదని ఓ మ్యాట్రీమొనీలో తప్పుడు సమాచారం ఇచ్చాడు. తాను యుకెలో ఇంజనీర్‌ని అని పేర్కొన్నాడు. రాజస్థాన్‌కు చెందిన రచనా వ్యాస్‌ను 2003లో వివాహం చేసుకున్నాడు. వారికి ఇద్దరు ఆడపిల్లలు పుట్టిన తర్వాత అదనపు కట్నం కోసం ఆమెను కూడా వేధించసాగాడు.

ఇతను తప్పుడు సమాచారం ద్వారా లండన్ కూడా వెళ్లి తిరిగి వచ్చాడు. ఎస్‌బిఐలో నాలుగు లక్షల రూపాయల కేసు హైకోర్టులో పెండింగులో ఉంది. కేసు కోర్టులో పెండింగులో ఉండగా అతను లండన్ వెళ్లి రావడంపై పోలీసులు ఆశ్చర్యానికి గురయ్యారు. రాజస్థాన్ అధికారులను తప్పుదోవ పట్టించి అతను లండన్ వెళ్లి వచ్చాడు. అతను తిరిగి వచ్చాక రెండో భార్యతో కలిసి ఉంటుండగా.. అతని గురించి రెండో భార్యకు తెలిసింది.

పాసుపోర్టు ద్వారా అతనికి మొదటి భార్య ఉందని తెలుసుకుంది. రెండో భార్యతో తన పెళ్లి పెటాకులు చేయడానికి మొదటి భార్య ప్రయత్నిస్తుందని భావించిన అతను మొదటి భార్యకు బెదిరింపు మెయిల్స్ పంపాడు. అంతేకాదు ఓ హోటల్‌లో ఉండి మరో మోసానికి కూడా పాల్పడాలని భావిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు.

English summary
A middle-aged man was arrested today from Secunderabad for allegedly sending threatening e-mails to his ex-wife, suspecting that she helped his second wife in exposing his "criminal past", police said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X